డీహైడ్రేషన్‌కు గురైన వారిలో కనిపించే లక్షణాలు ఇవే. వెంటనే ఏం చెయ్యాలో తెలుసుకోండి.
బాగా దాహం వేయడం, తలనొప్పి, అసౌకర్యంగా అనిపించడం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రావడం, మానసికంగా గందరగోళం, ఏ కారణంలేకుండానే అలసటగా ఉండటం, గోళ్ళు ఊదారంగులోకి తిరగడం, మూర్ఛ మొదలైనవి డీహైడ్రేషన్ ప్రధాన చిహ్నాలు. శరీరంలో నీటి నష్టం ఎక్కువయ్యే కొద్దీ ఈ లక్షణాలు మరింత తీవ్రతరమవుతాయి. అయితే డీహైడ్రేషన్ అనేది చిన్న సమస్య కాదు, ఇది మీలోని శక్తి పూర్తిగా హరించి వేస్తుంది, మిమ్మల్ని బలహీనంగా మార్చి మంచానికే పరిమితం అయ్యేలా చేస్తుంది.
దీర్ఘకాలంగా కొనసాగే డీహైడ్రేషన్ మీ మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది, కిడ్నీలలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. నీరు, పండ్ల రసాలు తగ్గించడం, అల్కాహాల్, టీకాఫీలు డోసు పెంచటం వల్ల కూడా మీ శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. వేసవిలో చాలా మంది తరచుగా నిర్జలీకరణానికి గురవుతారు. ఇది శరీరంలో రకాల రకాల పరిస్థితులకు కారణమవుతుంది, అయితే వీటిలో అత్యంత తీవ్రమైనది ప్రేగులలో సమస్యలు. మీ శరీరంలో నీటి కొరత కారణంగా, కడుపు తిప్పేసినట్లు అవుతుంది.
ప్రేగుల పనితీరు మరింత దిగజారుతుంది. ఇది కాకుండా ఇతర సమస్యలు ఉండవచ్చు. ఎసిడిటీ.. శరీరం లోపల నీటి కొరత ఉన్నప్పుడు కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణ జరగదు. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ పెరగడం ప్రారంభమవుతుంది. ఇది కాకుండా మీ కడుపు pH దెబ్బతింటుంది. కడుపులో రకరకాలుగా ఉంటూ కడుపుకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది.
ప్రేగులకు మలం అంటుకోవడం.. శరీరంలో నీరు తక్కువైనపుడు పేగుల్లో మలం గట్టిగా మారుతుంది. పేగులకు మలం అంటుకోవడం జరుగుతుంది. ఇది మీరు తీవ్రమైన డీహైడ్రేషన్ ఎదుర్కొంటున్నారనడానికి సంకేతం. నీటి కొరత కారణంగా ప్రేగుల పనితీరు క్షీణిస్తుంది, ప్రేగు కదలికలు ప్రభావితమవుతాయి. దీని కారణంగా, మీరు మలబద్ధకం బారిన పడవచ్చు, పొట్టకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు. ఉబ్బరం, వికారం ఉబ్బరం, వికారం రెండూ మీ ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదని సూచిస్తాయి.
మీ శరీరంలో నీటి కొరత ఉంటే, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇది అపానవాయువు, ఉబ్బరానికి దారితీయవచ్చు, ఇది మరింత వికారంకు దారితీస్తుంది. ఈ లక్షణాలు తేలికైనవని మీరు భావిస్తే, మీరు తప్పులో కాలేసినట్లే. పరిస్థితి కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది. కాబట్టి, మీ పేగులను రీహైడ్రేట్ చేయడానికి, ముందుగా కొబ్బరి నీళ్లు తాగండి. ఆ తర్వాత పుష్కలంగా నీరు తాగటంతో పాటు నీరు అధికంగా ఉండే ఇతర ఆహారాలను తినండి. డీహైడ్రేషన్ ను తిప్పి కొట్టండి.