News

బంగారం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడేలా ఉందొ తెలిసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మీరా చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ధరణి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా 2006లో రిలీజ్ అయ్యి ఆశించినంత స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

ఇది ఇలా ఉంటే ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన చిన్నారి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక చిన్నారి పేరు సనూష. అయితే బంగారం మూవీలో వింధ్య రెడ్డి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి అసలు పేరు శనూష.

మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి సినీ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన చిన్నారి. బంగారం సినిమాతోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శనూష ఎంట్రీ ఇవ్వగా అప్పుడు ఆమె వయస్సు కేవలం 10 సంవత్సరాలే.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఆమె కెరీర్‌ విషయాకొనిస్తే.. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్‌గా అడుగు పెట్టింది.

తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంటలో కీలకపాత్రలో పోషించింది. 2019లో నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆమె పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. శనూష ప్రస్తుతం మళయాళంలో వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker