Health

దీన్ని రాస్తే చాలు, ఊడిన చోట వెంట్రుక‌లు మ‌ళ్లీ వ‌స్తాయి.

జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. వారు మెరిసే జుట్టుతో పాటు పొడవాటి జుట్టును కోరుకుంటారు. వాస్తవానికి, సరైన సమాచారం లేకపోవడం వల్ల, కొన్ని జుట్టు పెరగడానికి చర్యలను అవలంబించడం వల్ల ప్రయోజనాల కంటే జుట్టు రాలడం జరుగుతుంది. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది జుట్టుకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు.

ముఖ్యంగా జుట్టు రాలిపోవ‌డం చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. దీని వ‌ల్ల పురుషుల‌కు బ‌ట్ట‌త‌ల వ‌స్తోంది. దీంతో న‌లుగురిలో తిరిగేందుకు ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే కింద చెప్పిన ప‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. పైగా ఊడిన చోట వెంట్రుక‌లు మ‌ళ్లీ వ‌స్తాయి. జుట్టును పెరిగేలా చేయ‌డంలో మ‌న‌కు నువ్వుల నూనె ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇందులో విట‌మిన్ ఇ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జుట్టు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది.

ఇందుకు గాను కాస్త నువ్వుల నూనెను తీసుకుని వేడి చేయాలి. దీన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించాలి. 1 గంట సేపు అయ్యాక త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. దీంతో జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చుండ్రు ఉండ‌దు. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. జుట్టును పెంచుకునేందుకు మ‌న‌కు మందార పువ్వులు కూడా ఎంత‌గానో మేలు చేస్తాయి.

ఇందుకు గాను ఒంటి రెక్క మందార పువ్వును తీసుకుని దాని రెక్క‌ల‌ను తీయాలి. వాటిని కొబ్బ‌రినూనె లేదా నువ్వుల నూనెలో వేసి మ‌రిగించాలి. దీంతో నూనె న‌ల్ల‌గా మారుతుంది. అనంత‌రం ఆ నూనెను సేక‌రించి త‌ల‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత 1 గంట ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తుంటే తెల్ల జుట్టు న‌ల్ల‌గా మార‌డ‌మే కాదు.. జుట్టు రాల‌డం కూడా త‌గ్గుతుంది.

ఇక మందార ఆకుల‌ను మెత్త‌గా నూరి త‌ల‌కు బాగా ప‌ట్టించి త‌రువాత కొంచెం సేపు ఆగి త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేస్తున్నా కూడా జుట్టు రాల‌డాన్ని ఆప‌వ‌చ్చు. ఇలా ఈ చిట్కాలు జుట్టు స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది. అలాగే చుండ్రు న‌శిస్తుంది. శిరోజాలు దృఢంగా పెరుగుతాయి. అన్ని జుట్టు స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker