News

యాక్సిడెంట్ తర్వాత హీరోయిన్ ఆదా శర్మ ఎలా ఉందొ మీరే చుడండి.

తాజాగా ది కేరళ స్టోరి డైరెక్టర్ సుదీప్తో సేన్, హీరోయిన్ ఆదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదంలో గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్, ఆదా శర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కరీంనగర్‌లో సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా… ప్రమాదం జరగడంతో తాము రాలేకపోతున్నట్లు డైరెక్టర్ సుధీప్తో సేన్ ట్వీట్ చేశారు.

ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాను కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో తెరకెక్కించారు. ఇందులో కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది.

అయితే ఎప్పటినుంచో సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికీ తాజాగా విడుదలైన ఇది కేరళ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆదాశర్మ. ఎన్నో వివాదాలు మధ్య విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సంపాదించడంతో పాటు ఈ సినిమాలో నటించిన ఆదాశర్మకు, ఇతర నటీనటులకు, దర్శకుడు సుదీప్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే తాజాగా ఆదాశర్మ యాక్సిడెంట్ కు గురైన సంగతి తెలిసిందే.

ఈ విషయంపై ఆందోళన పడుతున్న తన అభిమానులకు తన ఆరోగ్యం బాగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. ది కేరళ స్టోరీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న నటి ఆదాశర్మ. తాజాగా ఈమె దర్శకుడు సుదీప్ తో కలిసి వెళుతుండగా వీరిద్దరికీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. వీరిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో పలువురు వీరి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీయడం మొదలుపెట్టారు. వీటన్నిటిపై ఒక క్లారిటీ ఇస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానని చిన్న గాయాలతో బయటపడ్డాను అంటూ తెలిపింది ఆదాశర్మ. “యాక్సిడెంట్ వార్త తెలియడంతో అందరూ కంగారు పడుతున్నారు. దీంతో నాకు ఎన్నో మెసేజ్స్ వస్తున్నాయి. సీరియస్ ఏమి లేదు. స్వల్పంగా గాయపడ్డాం అంతే. నేను, మా మూవీ టీం మొత్తం బాగానే ఉన్నము.. అంటూ ట్వీట్ చేసింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker