నిద్రలో పీడకలలు వస్తున్నాయా..? అవి దేనికీ సంకేతమో తెలుసా..!
ఎవరో తరుముతున్నట్టు, పాము వెంటపడుతున్నట్టు, దయ్యాలు కనిపించినట్టు, ఎవరో తమను చంపడానికి వస్తున్నట్లు.. ఇలా భయపెట్టే కలలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఆ భయంతో రాత్రంతా నిద్రపోకుండా ఆందోళన చెందుతుంటాం. కొందరిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కానీ దీన్ని సీరియస్‌గా తీసుకునేవారు చాలా తక్కువ. అవే వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ ఇలాంటి పీడకలలు భవిష్యత్తులో రాబోయే మతిమరుపుకు సూచనలు అంటున్నారు పరిశోధనలు. అయితే మనం తినే ఆహారాలు మన ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీ చర్మం, జుట్టు, నిద్ర మీద కూడా ప్రభావం చూపిస్తాయి.
కొన్నిసార్లు మీరు తినే ఆహారం కలలు వచ్చేలా చేస్తాయట. కొన్నిసార్లు మీరు తినే ఆహారం హాని కలిగిస్తాయి. అందుకే, ఆయుర్వేదం నుంచి ఆధునిక వైద్య శాస్త్రం వరకు.. ఆహారపు అలవాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ చేయవలసినవి, చేయకూడనివి సిఫార్సు చేస్తారు. నిపుణులు ఆహారాన్ని జాగ్రత్తగా అనుసరించాలని సలహా ఇస్తారు. ప్రతి మనిషికి నిద్ర చాలా అవసరం. మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్ర లేకపోవడం మీ శరీరంపై వివిధ ప్రభావాలను కలిగిస్తుంది. మీరు తినే ఆహారాలు కూడా మీ నిద్రలేమి సమస్యకు కారణం కావొచ్చు. నిద్రలేమి, చెడు కలలను కలిగించే కొన్ని ఆహారాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
చీజ్‌లో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపించే హార్మోన్ సెరోటోనిన్‌కు పూర్వగామిగా పనిచేస్తుంది. అధ్యయనాల ప్రకారం ఇది తరచుగా నిద్ర సమస్యలను కలిగిస్తుంది. చెడు కలలకు కారణం అవుతుంది. అందువల్ల, స్టిల్టన్ చీజ్ చెడ్డదని, రాత్రిపూట దీనికి దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. వేడి సాస్‌ల అధిక వినియోగం తరచుగా శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారితీస్తుంది. ఇది వేగవంతమైన కంటి కదలికతో నిద్రలో కలల రూపాన్ని మరింత మారుస్తుంది. పీడకలలకు కారణమవుతుంది. దీని కారణంగా, మీరు ప్రశాంతమైన మంచి నిద్రను పొందలేరు.
బ్రెడ్, పాస్తాలో పిండి పదార్థాలు మరియు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరం లో గ్లూకోజ్‌గా మారుతాయి. చక్కెర కలిగిన ఆహారాలు మీ శరీరంపై అదే ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇది క్రమరహిత నిద్ర, చెడు కలలను కలిగిస్తుంది. చాక్లెట్‌లో కెఫిన్ పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఇది గాఢ నిద్రలో ఉండే సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తేలింది. అశాంతి, పీడకలలను కూడా కలిగిస్తుంది. ఫలితంగా మీరు నిద్రలేమికి గురవుతారు. ఫ్రాంటియర్స్ ఆఫ్ సైకాలజీలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, చిప్స్ వంటి పదార్థాలు జీర్ణం కావడానికి సమయం తీసుకుంటాయి. రాత్రిపూట వాటిని తినడం వల్ల చంచలత్వం, క్రమరహిత నిద్ర వస్తుంది.
ఇది తరచుగా భయంకరమైన పీడకలలను కూడా కలిగిస్తుంది. దీని వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టదు. వేడి కోకో.. ఇది చక్కెర, పాలు, కోకో పౌడర్ ఉపయోగించి తయారు చేసిన డెజర్ట్. తినేటప్పుడు, ఇది తరచుగా శరీరాన్ని తక్షణమే వేడి చేస్తుంది. రాత్రిపూట ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం, రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా మీ రాత్రి నిద్ర దెబ్బతింటుంది. ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట పెరుగు తినడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. శ్వాసకోశ వ్యవస్థను అడ్డుకుంటుంది. మెదడుకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అశాంతి, చెడు కలలను కూడా కలిగిస్తుంది. ఇది మీ రాత్రి నిద్రను ప్రభావితం చేస్తుంది.