పెనుప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సుడిగాలి సుధీర్.
మెజిషియన్ నుంచి జబర్దస్థ్‌లో కంటెస్టెంట్‌గా ప్రయాణం మొదలు పెట్టిన సుధీర్ అనతికాలంలోనే తన కామెడీ టైమింగ్‌తో లీడర్‌గా మారి సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సినిమాల్లో అడపా దడపా క్యారెక్టర్లు చేస్తూ వస్తున్న సుధీర్ హీరోగా మారి హిట్ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఆయన హీరోగా నటించిన గాలోడు రిలీజై బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ సక్సెస్ సాధించింది.
అయితే వేణు వండర్స్ టీం లో ఒక మామూలు కంటెస్టెంట్ గా పాల్గొన్న సుడిగాలి సుధీర్ లోని టాలెంట్ ని గమనించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, సుధీర్ కి టీం లీడర్ అయ్యే ఛాన్స్ ఇచ్చింది. టీం లీడర్ అయ్యాక ఎన్నో అబ్దుతమైన స్కిట్స్ చేసి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
ఆకలితో అలమటించి, ట్యాప్ వాటర్ తాగి బ్రతికిన రోజుల నుండి, మ్యాజిక్ షోస్ ద్వారా జీవనం గడుపుకునే సుడిగాలి సుధీర్, నేడు ఈ స్థాయికి ఎదిగిన విధానం ప్రతీ ఒక్కరికి ఎంతో ఆదర్శప్రాయం. అయితే సుడిగాలి సుధీర్ అప్పట్లో ఒక ప్రాణాపాయ స్థితి నుండి ఎంతో కష్టం మీద బయటపడ్డాడు అనే విషయం చాలా మందికి తెలియదు.అసలు విషయానికి వస్తే సుధీర్ వెన్ను దగ్గర ఒక కురుపు ఉంది, దానివల్ల ఆయన ఎంతో ఇబ్బందులకు గురి అయ్యాడు.
ఆపరేషన్ చేసి ఆ కురుపు తీసేసారు కానీ, ఆ ఆపరేషన్ వికటిస్తే సుధీర్ ప్రాణాలు పొయ్యేవి. ఈ ఆపరేషన్ జరుగుతున్నా సమయం లో నరాలకు ఏదైనా జరిగితే శరీరం మొత్తం మొద్దుబారిపోతాది, ఒక్కోసమయం ప్రాణాలు కూడా పోవచ్చు. కానీ సుధీర్ ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్ చేయించుకొని విజయవంతంగా సురక్షితంగా బయటపడ్డాడు.
అంతే కాదు సుధీర్ ఆ కురుపుతోనే షూటింగ్స్ చేసాడు,ఆ కురుపు తోనే ఎన్నో రిస్కీ స్తంట్స్ కూడా చేసాడు, ఏదైనా తేడా జరిగితే ఆయన ప్రాణాలకే ప్రమాదం, కానీ ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం ఆయన ఏమాత్రం వెనకాడలేదు, అందుకే సుధీర్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అని విశ్లేషకులు చెప్తున్న మాట.