టాయిలెట్‌లో మొబైల్ వాడే అలవాటుందా..? గుండె పగిలే నిజం మీ కోసమే.
ఫోన్ లేకుండా ప్రతిదీ కష్టంగా మారుతుంది. మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేం.. అనేట్లుగా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆఫీసు నుంచి మార్కెట్ వరకు చాలా వరకు స్మార్ట్ ఫోన్‌ల ద్వారానే జరుగుతుంది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. ఫోన్‌కి అతుక్కుపోతుంటాం.. గేమ్స్, వీడియోలు, చాటింగ్, సోషల్ మీడియా.. ఇలా చాలా వాటికి కనెక్ట్ అయ్యారు. అయితే ప్రస్తుత కాలంలో చిన్నలు పెద్దలు అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లను వాడుతున్నారు. వాటికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా యువత అయితే ఫోన్లను వాడకుండా ఉండలేకపోతున్నారు.
అంతెందుకు టాయిలెట్ కు కూడా ఫోన్లను తీసుకెళుతుంటారు. రీల్స్ చూడటం, వర్క్ మెయిల్స్ కు రిప్లే ఇవ్వడం వంటి ఎన్నో పనులను చేస్తుంటారు టాయిలెట్ సీటుపై కూర్చొని. కానీ టాయిలెట్ సీటుపై మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రాణాంతక వ్యాధుల బారిన పడేస్తుంది. ఈ అలవాటును ఎందుకు మానాలంటే.. నిజానికి టాయిలెట్ సీటు తెల్లగా కనిపించినంత మాత్రాన అది శుభ్రంగా ఉన్నట్టు కాదు. ఎందుకంటే టాయిలెట్ సీటుపై సూక్ష్మక్రిములు చాలా ఉంటాయి.
దానిపై కూర్చొని ఫోన్ లో పైకి కిందికి స్క్రోల్ చేస్తున్నప్పుడు మన చేతులకు ఎన్నో క్రిములు అంటుకుంటాయి. ఇవి కాస్త ముక్కు, కళ్లు, నోట్లోకి వెళతాయి. అయితే మొబైల్ ఫోన్ స్క్రీన్ పై ఉండే క్రిములు సుమారుగా 28 రోజులు బతికే ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాయిలెట్ సీట్ల కంటే స్మార్ట్ ఫోన్లపైనే పది రెట్లు ఎక్కువ సూక్ష్మక్రిములను మోసుకెళతాయని నిపుణులు చెబుతున్నాయి. టాయిలెట్ సీటును ముట్టుకుని ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ ను పట్టుకోవడం వల్ల దానిపై ఎన్నో క్రిములు ఉంటాయి. ఈ సూక్ష్మక్రిములు ఎన్నో రోగాల బారిన పడేస్తాయి. టాయిలెట్ లో ఉండే క్రిములేంటి.. స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే సూక్ష్మక్రిములు టాయిలెట్ సీటుపై ఉంటాయి.
అయితే టాయిలెట్ సీట్లపై ఉండే స్టెఫిలోకాకస్ ఇతర జాతులు మనుషులకు ఎంతో హానిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను కలిగిస్తాయి. టాయిలెట్ సీటులో ఇ.కోలి, ఎంటరోకోకస్, సాల్మొనెల్లా, షిగెల్లాలల, క్యాంపిలోబాక్టర్ లు కూడా ఉంటాయి. మీకొచ్చే అంటువ్యాధులేంటి.. టాయిలెట్ లో ఉండే సూక్ష్మక్రిములు మీ ఫోన్ కు అంటుకుని.. అవి మీకు అంటుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొత్తికడుపు నొప్పి, విరేచనాలు, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
గడ్డలు, సైనసైటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. టాయిలెట్ కు ఫోన్ ను తీసుకెళితే మీరు టాయిలెట్ సీటుపై అవసరానికి మించి ఎక్కువ సేపు కూర్చుంటారు. ఈ అలవాటుకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టాయిలెట్ సీట్లలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల హేమోరాయిడ్స్ ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఇది పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే మీ పాయువు చుట్టూ ఉన్న సిరలు ఒత్తిడికి గురవుతాయి. ఉబ్బుతాయి. మరుగుదొడ్డిపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల దిగువ పురీషనాళంలో పెరిగిన ఒత్తిడి నుంచిచ హేమోరాయిడ్లు అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు.