వేసవిలో ఖచ్చితంగా తాగాల్సిన పానీయం టంకా తోరణి. ఎలా తాయారు చేస్తారో తెలుసా..?
మన శరీరానికి హానికలిగించే సాధారణ వైరస్ ల నుండి రక్షణ కల్పించటంలో ఇవి ఎంతో దోహదం చేస్తాయి. వీటిని మనరోజువారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలను రాకుండా చూసుకోవచ్చు. సాధారణ సమస్యలకు ఇవి చక్కని ఔషదంగా పనిచేస్తుండటంతో పూర్వం నుండి వీటి వాడకం కొనసాగుతూ వస్తుంది. అయితే టంకా తోరణి ఒడిశాలోని పూరి జిల్లాలో పుట్టిన భారతీయ పానీయం. ఎండవేడి నుండి రక్షించటంలో ,ఉపశమనం కలిగించటంలో టంకా తోరణి ఎంతగానో తోడ్పడుతుంది.
దీనిని ఉడికించిన అన్నం నీరు , జీలకర్ర, కొత్తిమీర గింజలు, యాలకులు మరియు నల్ల మిరియాలు, నీరు మరియు బెల్లం కలిపిన సుగంధ ద్రవ్యాల తో తయారు చేస్తారు. ఈ పానీయం కొద్దిగా తీపి ,కారంగా ఉండే మిశ్రమం, ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడే శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. ఎవరి ఇష్టాలు, అభిరుచులకు తగ్గట్టుగా, వేడిగా లేదంటే చల్లగా తీసుకోవచ్చు. దీనిని వేసవిలో ఒక ప్రసిద్ధ పానీయంగా చెప్పవచ్చు.టంకా తోరణిలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.
జలుబు మరియు అజీర్ణం వంటి సాధారణ వ్యాధుల చికిత్సకు తరచుగా దీనిని వినియోగిస్తారు. టంకా తోరణి అంటే ఏమిటి.. ఒడిశాలో దేవునికి ప్రసాదంగా సమర్పించేందుకు దీనిని తయారు చేస్తారు. టంకా తోరణిని ఉడికించిన అన్నంతో తయారు చేస్తారు. సుగంధ ద్రవ్యాలతో కూడిన మసాలాలను దీనిలో చేరుస్తారు. కాల్చిన జీలకర్ర, నిమ్మ ఆకులు, కరివేపాకు, అవసరమైతే కొద్దిగా ఉప్పును ఉపయోగిస్తారు. పచ్చిమిరపకాయలు వేస్తారు. మిశ్రమం యొక్క పులుపును బట్టి, పెరుగు కూడా కలుపుతారు. అప్పుడు మిశ్రమాన్ని 2-3 గంటలు తరువాత సేవిస్తారు.
ఇది సాంప్రదాయకంగా మట్టి కుండలలో తయారు చేయబడుతుంది, దీనివల్ల ఇది చల్లగా ఉంటుంది. టాంకా తోరణి వేసవికి మంచిదా.. టంకా తోరణి మన కడుపుని తేలికగా చల్లబరుస్తుంది, కాబట్టి ఇది గట్-హీలింగ్ డ్రింక్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా వేసవి నెలల్లో ఇది పొట్టలో తేలికగా ఉండి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన పానీయం. వేసవిలో టంకా టోరాని మంటను తగ్గించడానికి, జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది పేగుల ఆరోగ్యానికి ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను అందించే గొప్ప మూలం.
అంతేకాకుండా, ఒకరోజల్లా ఉడికించిన అన్నం నానబెట్టిన నీరు, పెరుగు , జీలకర్ర వంటి మసాలాల మిశ్రమం వేసవికి లో ఎంతో మేలు కలిగిస్తాయి. టంకా టోరానీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది అద్భుతమైన ఎంపిక. ఇది ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. వేసవిలో మధ్యాహ్నా వేళల్లో అలసిపోయి ఉన్న సమయంలో శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టాంకా టోరాని ఎలా తయారు చేస్తారు. టాంకా టోరాని తయారీకి ఉపయోగించే పదార్దాలు..
ఒకరోజల్లా నానబెట్టి ఉంచిన ఉడికించిన అన్నంతో కూడిన నీరు, పెరుగు, నీరు, అల్లం, మామిడి, పచ్చి మిరపకాయలు, ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, నిమ్మ ఆకులు, కరివేపాకు, తులసి ఆకులు, నిమ్మకాయ. తయారీ ; వండిన అన్నంలో నీరు పోసి బాగా కలుపుకోవాలి. అన్నంమొత్తం మెత్తగా అయ్యేంత వరకు కలపాలి. అన్నాన్ని మెత్తగా చేసి, పానీయం వంటి స్థిరత్వాన్ని పొందే వరకు నీరు పెరుగు వేసుకోవాలి. అందులో అన్ని మసాలా దినుసులు వేసి కలపాలి. మిశ్రమాన్ని 2-3 గంటలు ఉంచి, ఆపై చల్లగా సర్వ్ చేయాలి. ఇది చల్లాగా ఉండేందుకు మట్టి కుండలలో తయారు చేసుకోని పెట్టుకోవాలి.