సజ్జ తో సింపుల్ రొట్టెలు చేసుకొని తింటే జీవితంలో ఈ ఆరోగ్య సమస్యలే వుండవు.
పూర్వకాలంలో ప్రతి ఇంటిలో మిల్లెట్‌తో చేసిన రోటీని తయారు చేయడం సాధారణ పద్ధతి. ఇప్పుడు అలా కానప్పటికీ.. జొన్న రొట్టెలతోపాటు సజ్జల రొట్టెలను తినేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిరు దాన్యాలపై చాలా అవగాహన పెరిగింది. కొన్నిసార్లు సజ్జల చపాతీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది చాలా స్లోగా మారడానికి ఇది కారణం. ఎందుకంటే వాటిని తయారుచేసే పాత చిట్కాలు ఈ తరంవారికి తెలియకపోవడంతో సజ్జల రొట్టెను చేయడం రావడం లేదు.
అటువంటి అమ్మమ్మ వంటకాన్ని ఇక్కడ మేము మీకు మరోసారి పరిచయం చేస్తున్నాం. దీని ద్వారా రోటీ ఒక్క క్షణంలో రెడీ చేసుకోవచ్చు. అయితే మామూలుగా చాలామంది రొట్టెలని తయారు చేసుకుంటూ ఉంటారు కానీ మామూలు రొట్టెలు కాకుండా సజ్జ రొట్టెలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చిరుధాన్యాల్లో సజ్జలు కూడా ఒకటి. సజ్జలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పూర్వకాలం నుండి కూడా సజ్జలని మనం ఆహారంగా తీసుకునే వాళ్ళం.
సజ్జలను తీసుకోవడం వలన చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది..వీటిని తీసుకోవడం వలన ఒత్తిడి నుండి దూరంగా ఉండొచ్చు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు సజ్జలను తీసుకుంటే ఒత్తిడి దూరం అవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలనుకునే వాళ్ళు వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.
ఆందోళన తగ్గుతుంది..సజ్జలను తీసుకుంటే ఆందోళన కూడా తగ్గుతుంది ఆందోళనతో బాధపడే వాళ్ళు సజ్జలని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. అజీర్తి, మలబద్ధకం..సజ్జలని తీసుకోవడం వలన అజీర్తి, మలబద్ధకం సమస్య కూడా ఉండదు. జీర్ణ వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి అవుతుంది. బరువు తగ్గొచ్చు..బరువు తగ్గడానికి చాలామంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు సజ్జలను తీసుకుంటే బరువు తగ్గడానికి అవుతుంది.
కొలెస్ట్రాల్ కరుగుతుంది..శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు కూడా సజ్జలు ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..సజ్జలను తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది అలానే రక్తహీనత తగ్గుతుంది. మెదడు బాగా పనిచేస్తుంది..సజ్జల వలన మెదడు పనితీరు కూడా బాగుంటుంది జ్ఞాపకశక్తిని కూడా పెంచుకోవచ్చు. సజ్జల తో వివిధ రకాల ఆహార పదార్థాలను మనం తయారు చేసుకోవచ్చు. రొట్టెలు, సంగటి, అప్పాలు ఇలా వివిధ రకాల ఆహార పదార్థాలను మనం వీటితో తయారు చేసుకోవచ్చు దానితో ఆరోగ్యంగా ఉండొచ్చు ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.