Health

పాలిచ్చే తల్లుల్లు త‌మ బిడ్డ‌ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి.

పాలిచ్చే త‌ల్లులు డైటిషియ‌న్లు సూచిస్తున్న ప్ర‌కారం నిత్యం వారు 300 నుంచి 500 క్యాల‌రీలు అధికంగా ల‌భించేలా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే ఆహారంలో ముఖ్య‌మైన పోష‌కాలు ఉండేలా చూడాలి. దీంతో బిడ్డ‌కే కాదు, త‌ల్లి ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అలాగే త‌ల్లుల్లో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. ఆ పాల‌ను సేవించే బిడ్డ‌ల‌కు అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే పాలిచ్చే తల్లులు మంచి పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

చాలా మంది తల్లులు బిడ్డకి పాలు సరిపోక బాధపడుతూ ఉంటారు. వివిధ రకాల ఇంటి చిట్కాలని పాటిస్తూ ఉంటారు. పాలిచ్చే తలలు కచ్చితంగా ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓట్స్..పాలిచ్చే తల్లులు ఓట్స్ ని తీసుకుంటే పాల సరఫరా బాగుంటుంది.

దీనిలో ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్ ని కూడా ఇది తగ్గిస్తుంది. అవకాడో.. అవకాడో లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి పాలిచ్చే తల్లులకు ఆకలి ఎక్కువేస్తుంది అటువంటప్పుడు దీనిని తీసుకోవడం చాలా మంచిది. నట్స్.. ఐరన్, క్యాల్షియం, జింక్ నట్స్ లో ఎక్కువగా ఉంటుంది.

నట్స్ ని తీసుకుంటే కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాలిచ్చే తల్లులకు ప్లస్ అవుతుంది. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులలో బీటా గ్లూకోన్ ఎక్కువగా ఉంటుంది పుట్టగొడుగుల్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఆకుకూరలు.. ఆకుకూరలు ఎవరికైనా మంచి చేస్తాయి. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఆకుకూరలు చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి.

పాల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి వీటిని కూడా ఎక్కువగా డైట్ లో తీసుకుంటూ వుండండి. క్యారెట్.. క్యారెట్ తినడం వలన పాలిచ్చే తల్లులు ఆరోగ్యంగా ఉండగలరు. పైగా ఇది పాల నాణ్యత ని కూడా పెంచేస్తుంది. కాబట్టి పాలిచ్చే తల్లులు వారి డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker