టీటీ ఇంజెక్షన్ ఎన్నిరోజులకు ఒకటి తీసుకుంటే మంచిదో తెలుసా..?
టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి. దీని గురించిన మొదటి ప్రస్తావన క్రీస్తు పూర్వం అయిదవ శతాబ్దంలోనే హిప్పోక్రేట్స్ రచనల్లో కనిపిస్తుంది. ఇది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ రోజుకీ ధనుర్వాతం అంటే టెటనస్ బారిన పడిన వారిలో 70-80% మరణాలు నమోదు అవుతున్నాయి. కాబట్టి, చిన్న పిల్లలకు తప్పనిసరిగా ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. గర్భిణులకు కూడా టీటీ ఇంజెక్షన్ ఇస్తారు. కాన్పు సమయంలో తల్లికి, బిడ్డకు ఇది రక్షణ ఇస్తుంది.
అయితే మనలో చాలా మంది టీటీ ఇంజక్షన్లు తీసుకుంటుంటారు. ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే టీటీ ఇంజక్షన్ తీసుకోవడం సాధారణమే. ఎందుకంటే సెప్టిక్ అవుతుందనే భయంతోనే టీటీ చేసుకుంటారు. టీటీకి అంతటి ప్రాధాన్యం ఉందా? దీంతో మనకు ఎలాంటి ముప్పు రాకుండా నిరోధిస్తుందా? అనే అనుమానాలు చాలా మందికి వస్తుంటాయి. టీటీ తీసుకోవడం వల్ల సెప్టిక్ బాధ నుంచి మాత్రం రిలాక్స్ కావచ్చు. టీటీ ఇంజక్షన్ల గురించి ఏవో అనుమానాలు ఉండటంతో వాటిని తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
గతంలో కూడా మనకు ధనుర్వాతం రాకుండా టీకాలు ఇచ్చే వారు. పిల్లలకు ఇచ్చే టీకాలలో ఇది కూడా ఉంటుంది. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఇన్ఫెక్షన్ లలో ఒకటి. టీటీ ఇంజక్షన్ కూడా ఇది రాకుండా ఇచ్చేదే కావడం గమనార్హం. గర్భిణులకు కూడా ఈ టీకా ఇస్తారు. దీంతో తల్లి బిడ్డ సురక్షితంగా ఉండాలని చూస్తారు. ఇందులో భాగంగానే ఈ టీకా ఇస్తుంటారు. మనకు ఏవైనా గాయాలు, పుండ్లు అయినప్పుడు మన శరీరంలోకి బ్యాక్టీరియా చేరుతుంది.
ఇలాంటి సందర్భాల్లో బ్యాక్టీరియా కలిగించే నష్టాలకు చెక్ పెట్టేందుకే ఈ టీటీ వేస్తారు. ఇది వేసుకోకపోతే మనకు ఇన్ఫెక్షన్ పెరిగితే కొన్ని లక్షణాలు బయటకు వస్తాయి. దీంతో మనకు రోగ తీవ్రత పెరుగుతుంది. దీంతో ప్రాణాలు కోల్పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ఎక్కువైతే కలిగే లక్షణాలలో నోటి కండరాలు పట్టేస్తాయి.
కండరాలు బిగుసుకుపోయి నొప్పి పెరుగుతుంది. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, చెమటలు పడతాయి. మూర్చ లేదా ఫిట్స్ వస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. రక్తపోటు పెరిగి ప్రాణాలనే హరిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రిలో చేరి గాయం అయిన చోట శుభ్రం చేసి యాంటీ బయోటిక్ ఇంజక్షన్లు, కండరాల నొప్పులను తగ్గించే మందులు వాడుతూ ఒంట్లో నీరు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.