Health

మన దేశంలో బ్రెయిన్ స్ట్రోక్ తో ప్ర‌తి నాలుగు నిమిషాల‌కు ఒక‌రు మృతి. ముందే ఏం చెయ్యాలంటే..?

కొన్నిసార్లు బ్రెయిన్ ఎటాక్ అని పిలిచే స్ట్రోక్, మెదడులోని కొంత భాగానికి రక్తసరఫరా ఆగిపోయినప్పుడు, మెదడులోని రక్తనాళం పగిలిపోయినప్పుడు వస్తుంది. స్ట్రోక్ లక్షణాలు ముఖం, చేయి, కాలు, ముఖ్యంగా శరీరం ఒకవైపున ఆకస్మిక తిమ్మిరి, బలహీనత, ఇబ్బందిగా అనిపించడం, మాట్లాడడంలో ఇబ్బంది, మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది.

అయితే భార‌త్‌లో ప్ర‌తి నాలుగు నిమిషాల‌కు స్ట్రోక్ కార‌ణంగా ఒక‌రు మ‌ర‌ణిస్తున్నార‌ని ఎయిమ్స్ న్యూరో నిపుణులు డాక్ట‌ర్ ఎంవీ ప‌ద్మ శ్రీవాస్త‌వ తెలిపారు. భార‌త్‌లో స్ట్రోక్ రెండో అత్య‌ధిక మ‌ర‌ణాల కార‌కంగా ఉంద‌ని, దేశంలో ఏటా 1,85,000 స్ట్రోక్ కేసులు వెలుగుచూస్తున్నాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌తి 40 నిమిషాల‌కు ఒక‌రు స్ట్రోక్ బారిన‌ప‌డుతున్నార‌ని ఎయిమ్స్‌లో న్యూరాల‌జీ ప్రొఫెస‌ర్ ప‌ద్మ పేర్కొన్నారు.

భార‌త్‌లో స్ట్రోక్ కేసులు 68.6 శాతం పెర‌గుతున్నాయ‌ని, 70.9 శాతం స్ట్రోక్ మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయ‌ని గ్లోబ‌ల్ బ‌ర్డెన్ ఆఫ్ డిసీజెస్ (జీబీడీ) గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. ఈ గ‌ణాంకాలు భార‌త్‌లో స్ట్రోక్ ముప్పుపై ఆందోళ‌న పెంచుతున్నాయ‌ని అన్నారు.

జీబీడీ 2010లో వెల్ల‌డైన వివ‌రాల ప్ర‌కారం చిన్నారులు, 20 ఏండ్ల లోపు వారిలో 52 ల‌క్ష‌ల స్ట్రోక్‌లు త‌లెత్తాయ‌ని, యువ‌, మ‌ధ్య‌వ‌య‌సు వారిలో స్ట్రోక్ కేసులు ఆందోళ‌న రేకెత్తిస్తున్నాయ‌ని వైద్య నిపుణులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భార‌త్‌లో స్ట్రోక్ కేసులు, స్ట్రోక్ ముప్పు అధికంగా ఉన్నా ప‌లు ఆస్ప‌త్తుల్లో అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాలు,

స్ట్రోక్ రోగుల‌కు వేగంగా, స‌మ‌ర్ధ‌వంతమైన చికిత్స అందించ‌డంలో స‌రైన ఏర్పాట్లు లేవ‌ని ముఖ్యంగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప‌రిస్ధితి ద‌య‌నీయంగా ఉంద‌ని నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌మాజంలో పేద‌వ‌ర్గాలకు ఈ దిశ‌గా స‌రైన చికిత్స అందాలంటే టెలిమెడిసిన్‌, టెలిస్ట్ర్రోక్ స‌దుపాయాలు క‌ల్పించాల‌ని డాక్ట‌ర్ ప‌ద్మ సూచించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker