Health

ఈ ఆహారాపదార్థాలు వయాగ్రా కంటే పవర్‌ఫుల్, పెళ్ళైనవారు ఖచ్చితంగా తినాలి.

వయాగ్రాను మించి పవర్‌ఫుల్ పదార్థాలు మనం ఇంట్లోనే ఉన్న విషయాన్ని చాలా మంది కూడా అస్సలు గ్రహించడం లేదు. వాటిని తినడం ద్వారా సహజంగానే మన లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్స్ అతిగా తినడం, సరికాని జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల చాలా మంది పురుషులు లైంగిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా అంగస్తంభన సమస్య ఒకటి. శృంగారానికి అత్యంత కీలకం అంగస్తంభన. అదే సరిగా లేకపోతే.. లైంగిక జీవితం అసంతృప్తిగా ఉంటుంది. అయితే, అంగస్తంభనకు అనేక కారణాలు ఉన్నాయి.

పురుషాంగానికి సరైన రక్తసరఫరా లేకపోవడం, నరాల బలహీనత, మధుమేహం, యాంగ్జైటీ, ఒత్తిడి, నిరాశ, మద్యపానం, స్మోకింగ్, రక్తపోటు, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వంటివి చాలానే ఉన్నాయి. అయితే, చాలా మంది అంగస్తంభన సమస్య నుంచి బయటపడేందుకు వయాగ్రా వంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. ఇవి ఆ సమయానికి సంతృప్తినిస్తాయి. కానీ, శాశ్వత పరిష్కారం చూపించవు. పైగా వీటిని అతిగా వేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, వయాగ్రాను మించి పవర్‌ఫుల్ పదార్థాలు మనం ఇంట్లోనే ఉన్న విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదు.

వాటిని తినడం ద్వారా సహజంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ ఇస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది. వెల్లులి.. ఒక నెల రోజులపాటు వెల్లులి క్రమం తప్పకుండా తింటే.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ముఖ్యంగా అంగస్తంభన సమస్యలు తొలగిపోతాయి. బాదం.. లైంగిక, సంతానోత్పత్తి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. బాదంలో ఉండే జింక్, ఒమెగా-3 ఫ్యాట్ యాసిడ్స్ అంగస్తంభన సమస్యలను తగ్గిస్తాయి.

అల్లం.. వెల్లులి తరహాలోనే అల్లంలో కూడా రక్త ప్రసరణ మెరుపరుస్తుంది. అంగస్తంభన సమస్యను తగ్గిస్తుంది. మిర్చి.. ఇందులో ఉండే రసాయనాలు గుండె వేగంతో పాటు కోరికలనూ పెంచుతాయి. గుమ్మడి కాయ గింజలు.. ఇందులో జింక్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ బి, ఇ, సి, డి, కె, కాల్షియం, పొటాషియం, నియాసిన్, పాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు ఇందులో ఉన్నాయి. మునగకాయలు.. ఇందులో ఉండే జింక్ తదితర పోషకాలు అంగస్తంభనకు ఉపయోగపడతాయి.. పుచ్చకాయలు.. ఇందులో ఉండే సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం మూడ్‌ను ఉత్తేజితం చేస్తుంది. సెక్స్‌కు ప్రేరేపిస్తుంది.

అవోకాడో.. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6, ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, విటమిన్-ఇ.. పురుషుల్లో హార్మోన్ల ఉత్పత్తి పెంచుతుంది. అరటి పండ్లు.. ఇందులో సెక్స్ హార్మోన్లను పెంచే బ్రొమలెన్‌తో పాటు విటమిన్-బి ఉంటాయి. బ్లాక్ చాక్లెట్.. ఇది హృదయనాళ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. అయితే, దీన్ని అతిగా తీసుకుంటే కొత్త సమస్యలు వస్తాయి. దానిమ్మ పండ్ల జ్యూస్.. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటకు పంపేస్తాయి. అంగస్తంభనకు ఇది చక్కని ఔషదమని చాలా పరిశోధనల్లో వెల్లడైంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker