ఈ కాయలు ఎక్కడైనా కనిపిస్తే ఎవ్వరికి చెప్పకుండా ఇంటికి తెచ్చుకోండి లక్షలు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులు తగ్గిస్తుంది.
మన చుట్టుపక్కన ఉన్న మొక్కలను పిచ్చి మొక్కలని, కలుపు మొక్కలని వాటిని పట్టించుకోము.. కానీ అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయట. ముఖ్యంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే బుడమ కాయ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మొక్కను కుప్పిట , మొక్క, బుడమకాయ మొక్క, బుడ్డ మొక్క, అడవి టమాటా అని కూడా అంటారు. ఈ మొక్కను ఇంగ్లీష్ లో వైల్డ్ టమాటా అని , గ్రౌండ్ చెర్రీ, వింటర్ చెర్రీ అని రకరాలుగా పిలుస్తారు.
ఈ మొక్కలు ఆకులు మృదువుగా ఉంటాయి. అందుకనే దీనిని మృదుమొక్కని సంస్కృతంలో పిలుస్తారు. ఈ మొక్కకు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఇది తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. అయితే బుడమకాయలను పూర్వ కాలంలో ఎక్కువగా వాడేవారు. బుడమకాయలతో పప్పు, ఆవకాయ, కూర, పచ్చడి చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటాయి. బుడమకాయలలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. బుడమకాయలలో విటమిన్ సి, ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, ఫైబర్, ఫాస్పరస్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. అధిక బరువును తగ్గించడానికి సహాయపడతాయి. ఫైబర్ సమృద్దిగా ఉండడం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వలన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడంలో సహాయపడతాయి.
అలాగే శరీర కణాల పెరుగుదల, మరమ్మత్తులను ప్రోత్సహిస్తాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి, రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వలన సన్నని గీతలు, ముడతలు, మచ్చలు, చర్మ వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తాయి.
రక్తపోటు నియంత్రణలో ఉంచడానికి, రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండడం వలన గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా బుడమకాయలు ఎంతగానో ఉపయోగపడతాయి.