ఈ చిన్న పని చేస్తే చాలు మీ ఊపిరితిత్తులు క్లీన్ అయ్యి, ఆరోగ్యంగా ఉంటారు.
ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగుంటునే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేల మన ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటే శరీరంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు వంటి సమమస్యలు కలుగుతాయి. కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవడం చాలా ఈజీ. అయితే ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా శుభ్రం చేసుకోవచ్చు. కఫం ఎక్కువగా ఉన్నవారు పాలు, దాని సంబంధ ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిల్లో ఉండే పలు రకాల పదార్థాల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి.
వీటిని ఆహారం నుంచి తొలగించడం మంచిది. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి.
ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఆరెంజ్, అరటిపండు, చిలగడదుంపలు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఉదయాన్నే పరగడుపున 4,5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.
కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం ఛాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఈ సూచనల్లో కనీసం 4 సూచనలను 3 రోజుల పాటు పాటిస్తే చాలు, తేడా మీకే తెలుస్తుంది. అయితే ఈ సూచనలను పాటించాలనుకునే వారు పొగ తాగకూడదు, మద్యం సేవించకూడదు. దీంతో రిజల్ట్ చక్కగా వస్తుంది. కనుక ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవాలంటే.. ఈ చిట్కాలను పాటించండి.