బాడీ మసాజ్ చేస్తే ఒంటి నొప్పులు తగ్గిపోయి, మీ అందం రెట్టింపు అవుతుంది.
బాడీ మసాజ్ అంత అవసరం లేదని అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజానికి బాడీ మసాజ్ మన శరీరానికి చాలా అవసరం. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలను కట్టడి చేస్తుంది. వారానికి ఒక్కసారి బాడీ మసాజ్ చేయించుకున్నా చాలు, ఎన్నో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మసాజ్ తో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సరైన ఆహారం, వ్యాయామం రోగనిరోధక శక్తిని బలోపేతం చేసినట్టే.. ఆయిల్ మసాజ్ కూడా ఇలాంటి ప్రయోజనాలను అందిస్తుంది. రెగ్యులర్ గా బాడీ మసాజ్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయంటే..
బాడీ మసాజ్ ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడం, కండరాల ఉద్రిక్తత, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. రెగ్యులర్ బాడీ మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర, మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బాడీ మసాజ్ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కార్డిసాల్ ఒత్తిడిని కలిగించే హార్మోన్. కార్టిసాల్ స్థాయిలు తగ్గితే ఒత్తిడి ఆటోమెటిక్ గా తగ్గిపోతుంది.
అయితే బాడీ మసాజ్ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. మసాజ్లు రక్త ప్రసరణను పెంచడం, మంటను తగ్గించడం, ఎండార్ఫిన్లను విడుదల చేయడం ద్వారా కండరాల ఉద్రిక్తత, నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. నిద్రపోవడానికి ముందు బాడీ మసాజ్ చేయడం వల్ల మీరు ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతారు. బాడీ మసాజ్ మీ నిద్ర నాణ్యతను పెంచుతుంది. మసాజ్ లు శరీరం, మనస్సును రిలాక్స్ చేస్తుంది.
ఇది చంచలత, ఆందోళన, ఆలోచనలను తగ్గించడానికి సహాయపడుతుంది. బాడీ మసాజ్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే ఒత్తిడి హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది. బాడీ మసాజ్ మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది బలమైన, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. మసాజ్ వల్ల శారీరక నొప్పులు తగ్గడమే కాకుండా మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. దీంతో మీ అందం పెరుగుతుంది.
శరీరమంతా మసాజ్ చేస్తే మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. మైగ్రేన్ కు ప్రధాన కారణం తీవ్రమైన ఒత్తిడి, మెడ నొప్పి. అయితే తల, భుజాలు, మధ్య భాగంలో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. ఈ మసాజ్ నెత్తిమీద రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.