డయాబెటిస్‌పై ప్రజల్లో ఉన్న అపోహలకు ఖచ్చితమైన సమాధానాలు ఇవే.
మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి. ఇది అర్థం చేసుకోవడం కష్టమైన పరిస్థితి. మీకు డయాబెటీస్ ఉంటే లేదా ఎవరికైనా మధుమేహం ఉందని తెలిసి ఉంటే, ఈ వ్యాధిపై మీకు చాలా సందేహాలు ఉండవచ్చు. మధుమేహం గురించి అనేక అపోహలు ఉన్నాయి. ఈ తప్పుడు నమ్మకాలు మనల్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అయితే పేలవమైన జీవనశైలి వల్ల ఈ రోజుల్లో చాలామంది మధుమేహం అనే దీర్ఘకాలిక వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఒకసారి వస్తే దీనిని వదిలించుకోవడం దాదాపు సాధ్యం. ఈ జబ్బును నియంత్రణలో ఉంచుకోవడానికి రోగులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
జీవితాంతం తీవ్ర ఇబ్బంది పెట్టే ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలంటే ముందుగానే దీని గురించి అవగాహన పెంచుకోవాలి. మధుమేహానికి అధిక చక్కెర వాడకమే కారణం.. అధిక చక్కెర తీసుకోవడం హానికరం కానీ ఇది డయాబెటిస్‌కు దారితీసే ఏకైక కారణం అని చెప్పడం తప్పు. టైప్ 1 మధుమేహం జెనిటిక్స్, ఇతర కారకాల వల్ల వస్తుంది. టైప్ 2 మధుమేహం పేలవమైన లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. కేలరీలు అధికంగా ఉండే ఆహారం బరువు పెరగడానికి కారణమవుతుంది. అధిక బరువు ఉండటం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.
మధుమేహం ప్రాణాంతకం కాదు.. చాలామంది ప్రజలలో మధుమేహం ప్రాణాంతకం కాదనే ఒక అపోహ ఉంటుంది. కానీ ఏ రకమైన మధుమేహం అయినా సరిగా నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఆయుష్షు బాగా తగ్గిపోవచ్చు. జీవితం నరకంగా అనిపించవచ్చు. ఊబకాయం మధుమేహానికి కారణం కావచ్చు.. లావుగా ఉంటే చాలు మధుమేహం వస్తుందనే ఒక అపోహ దాదాపు అందరిలో ఉంది. కానీ మధుమేహం విషయంలో ఇది ఎల్లప్పుడూ నిజం కాదు. సన్నగా ఉన్నవారు కూడా చక్కెర వ్యాధి బారిన పడతారు.
అందువల్ల ఊబకాయం అనేది టైప్ 2కి లేదా ఇతర డయాబెటిస్ వ్యాధికి ప్రత్యక్ష కారణం కాదు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే సరైన బరువును మెయింటైన్ చేయాలి. అలాగే తప్పనిసరిగా వ్యాయామం చేస్తే మంచిది. డయాబెటిస్ ఉన్నవారు ఎక్స్‌సర్సైజ్ చేయకూడదు.. షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి రోజూ వ్యాయామం చేయడం అవసరం. మీరు మందులు వాడుతున్నా, సరైన ఆహారం తీసుకున్నా సరే తప్పనిసరిగా వ్యాయామం చెయ్యకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాయామం ఇన్సులిన్‌కు మీ శరీరం సున్నితత్వాన్ని పెంచుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినకూడదు.. రోగాలను పోగొట్టే ఎన్నో పోషకాలు పండ్లలో ఉంటాయి. డాక్టర్ల సలహా మేరకు మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లను తినొచ్చు. అన్ని రకాల మధుమేహం ఒకటే.. అన్ని రకాల మధుమేహం ఒకటేనని కొందరు భావిస్తుంటారు. అన్నిటికి ఒకటే చికిత్స అవసరం అవుతుందని అనుకుంటారు. కానీ అది తప్పు. ఇక టైప్ 1, టైప్ 2, గెస్టేషనల్ డయాబెటిస్ వంటి రకరకాల మధుమేహ వ్యాధులు చాలామందిని ప్రపంచవ్యాప్తంగా వేధిస్తున్నాయి. టైప్ 2 భారతదేశంలో చాలా కామన్‌గా వేధిస్తున్న వ్యాధి.