మీ శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు, కంతులు కరిగించే అద్భుతమైన చిట్కాలు.
ఈ కొవ్వు గడ్డలు శరీరంలో అక్కడక్కడా వస్తూ ఉంటాయి. వీటి వలన నొప్పి, బాధ ఏమి ఉండవు.. ఇవి ఏర్పడిన ప్రవేశంలో నరాలమీద ఒత్తిడిని కలిగించి ప్రభావం చూపుతుంది.. ఈ కొవ్వు గడ్డలు లను మొదటిలోనే తగ్గించుకోవాలి.. అలా కాకుండా వీటిని అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ కు దారితీస్తుంది. అయితే మనకు వేసవి కాలంలో సెగగడ్డలు, కొవ్వు గడ్డలు వస్తుంటాయి. దీంతో మనకు ఎంతో ఇబ్బంది ఏర్పడుతుంది. ఎండాకాలంలో ఇవి రావడంతో జలజల జలుపుతుంటాయి. దీని వల్ల మనకు సమస్యలు రావడం చూస్తుంటాం.
కొవ్వు గడ్డలు చేతులపై వస్తుంటాయి. సెగగడ్డలు చంకల్లో ఏర్పడుతుంటాయి. అవి తిప్పలు పెడతాయి. సెగగడ్డలు చీము కారుతుంటాయి. దీంతో దుర్వాసన వస్తుంది. వీటి నుంచి తప్పించుకోవాలంటే కొన్నిసార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని వైద్యులు చెబుతుంటారు. గడ్డలను తగ్గించుకోవడానికి.. కొవ్వు, సెగగడ్డలకు అతిబల మంచి ఔషధంగా పనిచేస్తుంది. మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే మొక్క అతిబల.
మన శరీరంలో ఏర్పడే గడ్డలను నయం చేయడంలో ఇది ఎంతో దోహదపడుతుంది. వీటిని దూరం చేసుకోవడానికి తాటి బెల్లంను నీటితో కలిపి కొద్దిగా వేడి చేసి తాగాలి. అలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. మందార ఆకుల మిశ్రమాన్ని కణతిలకు పట్టిస్తే కూడా కొవ్వు గడ్డలు మాయమవుతాయి. చేదును కలిగించే మూలికలు కూడా కొవ్వును తగ్గించడానికి సాయపడతాయి. అతిబలతో..మనకు పల్లెటూళ్లలో విరివిగా కనిపించే మొక్క అతిబల.
దీని కాయలు చిన్న పిల్లలు ఆడుకునే వాటిగా ఉంటాయి. దీంతో దీని వినియోగంతో సెగగడ్డలు దూరమవుతుంటాయి. ఎండాకాలంలో మనల్ని ఇబ్బందులకు గురిచేసే కొవ్వు గడ్డలు, సెగగడ్డలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. లేకపోతే వాటితో మనకు అనేక రకాల నొప్పులు రావడం సహజం. అందుకే వాటిని తగ్గించుకోవడానికి అతిబల కాయలను వాడుకుంటే సరి. ఇవి ఎందుకొస్తాయి. వేసవి కాలంలో సెగగడ్డలు ఎందుకు వస్తాయంటే వేడి పదార్థాలు తినడంతోనే వస్తాయని చెబుతుంటారు.
ఎక్కువగా మామిడిపండ్లు తింటే సెగగడ్డలు వస్తాయనేది పలువురి వాదన. ఇందులో కొంచెం నిజం ఉంది. మామిడి పండ్లు మన శరీరంలో వేడిని పుట్టిస్తాయని అంటారు. దీంతోనే మనకు సెగగడ్డలు వస్తాయట. సాధ్యమైనంత వరకు అవి రాకుండా చూసుకుంటేనే మంచిది.