ఈ అలవాట్లను వెంటనే మానేయండి, అప్పుడే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
మెదడు పనితీరు మెరుగ్గా ఉండటంతో పాటు జ్ఞాపక శక్తి తగ్గకుండా ఉండేందుకు అవసరమైన ఆహార పదార్ధాలను విధిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగేందుకు దోహదపడే ఆహారంతో బ్రైన్ పవర్ ఎలా మెరుగుపరుచుకోవచ్చనే వివరాలను ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ షేర్ చేశారు. లెసిథిన్, కోలిన్ అధికంగా ఉండే ఆహారాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని ఆమె సూచించారు.
అయితే మెదడు.. మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలలో ఒకటి.. ఇది శరీరంలో మిగిలిన భాగాలకు ఎప్పుడు ఏం చేయాలనేది ఆదేశాలను ఇస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు సక్రమంగా పని చేయగలుతాయి. లేకపోతే.. పరిస్థితి తారుమారు అయి.. తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. అందుకే శరీరం సక్రమంగా పనిచేయాలంటే మెదడు (మైండ్) ను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. అందుకే మైండ్ హెల్త్ కోసం కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి.
దీంతోపాటు ఆహారంపై దృష్టి సారించాలి. వ్యాయామం చేయకపోవడం, ఎప్పుడూ నీరసంగా ఉండడం వల్ల మెదడు వృద్ధాప్యానికి గురవుతుంది. అందుకే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలి. ఎందుకంటే యాక్టివ్‌గా ఉండటం మీ శరీరానికి కూడా మేలు చేస్తుంది. కొంతమంది మద్యం ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ మెదడు కణాలు మొద్దుబారిపోవడంతోపాటు క్షీణించిపోతాయి.
కావున మద్యం అలవాటును మానుకోవాలి. ధూమపానం మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ మెదడుకు కూడా హానికరం. అధిక ధూమపానం కారణంగా, మెదడుకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మందికి స్వీట్లు ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. అయితే పంచదార ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెదడు కుంచించుకుపోవడంతోపాటు మీ మైండ్ వృద్ధాప్యం బారిన తొందరగా పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పచ్చి కూరగాయలు, ఆకుకూరలను తీసుకోకపోవడం వల్ల మీ చర్మం, జుట్టుతో పాటు మీ మెదడు కూడా ప్రభావితమవుతుంది. అందుకే మంచి ఆహారాన్ని తీసుకోవాలని.. దీనివల్ల మీ మెదడు వృద్ధాప్యం బారిన పడకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.