Health

దేశాన్ని వణికిస్తున్న ప్రాణాంతక సమస్య, ప్రతి 4 నిమిషాలకో మరణం.

బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం. ఇది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు స్ట్రోక్ వల్ల మరణిస్తున్నారని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) న్యూరాలజిస్ట్ వెల్లడించారు.

భారత్ లో ప్రతి సంవత్సరం 1,85,000 స్ట్రోక్స్ సంభవిస్తున్నాయి. దాదాపు ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్ సంభవిస్తుంది. గ్లోబల్ బర్డేన్ ఆఫ్ డిసీజెస్(GBD) ప్రకారం మన దేశంలో 68.6 శాతం స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. 70.9 శాతం స్ట్రోక్ మరణాలు సంభవిస్తుంటే 77.7 శాతం మంది స్ట్రోక్ వల్ల వికలాంగులుగా మారి మంచానికే పరిమితం అవుతున్నారు. స్ట్రోక్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా పేదలు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చిన్న, మధ్య వయసు వారిలో స్ట్రోక్ భారం ఎక్కువగా ఉంటుంది. జీబీడీ విశ్లేషణ ప్రకారం 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో 31 శాతం స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు తెలిపారు.

స్ట్రోక్ బాధితులకు సమర్థవంతమైన చికిత్స అందించేందుకు సరైన మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగా ఆసుపత్రుల్లో స్ట్రోక్ సేవలు చాలా దారుణంగా ఉన్నాయని న్యూరాలజిస్ట్ తెలిపారు. స్ట్రోక్ ప్రాణాంతకం కావచ్చు. లేదా పక్షవాతానికి దారితీస్తుంది. స్ట్రోక్ వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రోగికి చికిత్స అందించాలి ఆ తర్వాత న్యూరాన్ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. స్ట్రోక్ అంటే ఏంటి? ఎన్ని రకాలు.. స్ట్రోక్ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు సంభవిస్తుంది.

మెదడులో రక్తం గడ్డ కట్టడం, రక్తం, ఆక్సిజన్ సరఫరా సరిగా జరగకపోవడం వల్ల కూడా ఇది జరుగుతుంది. న్యూరాలజీ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం డిప్రెషన్ స్ట్రోక్ తో ముడి పడి ఉందని తెలిపారు. డిప్రెషన్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే అదే డిప్రెషన్ స్ట్రోక్ తర్వాత కోలుకునేలా చేస్తుందని కూడా అంటున్నారు. కోవిడ్ తో పాటి స్ట్రోక్ కేసులు పెరుగుతూ వచ్చాయి. యూఎస్ లోని థామస్ జెఫేర్సన్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం కోవిడ్ తో బాధపడుతున్న వ్యక్తులు, స్ట్రోక్ వచ్చిన వాళ్ళు కోలుకోవడం కష్టంగా ఉంటుందని తెలిపారు.

బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మరొక కారణం హైబీపీ. అందుకే రక్తపోటు అదుపులో ఉండేలా చూసుకోవాలి. స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి ఇస్కిమిస్క్ స్ట్రోక్ రెండోది హేమరెజిక్ స్ట్రోక్. రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకి రక్త సరఫరా నిలిచిపోతే ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. రక్తనాళం పగిలిపోవడం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. వీటిలో ఎక్కువ మంది ఇస్కిమిక్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. స్ట్రోక్ లక్షణాలు..స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు కొన్ని తీవ్రంగా ఉంటాయి. మాట్లాడలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, నోరు పడిపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker