పరగడుపున వీటిని తింటే జీవితంలో గుండె సమస్యలు రావు.
మఖానా.. ఈ రోజుల్లో ఇది చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారింది. ప్రజలు దీనిని నెయ్యిలో వేయించి, ఖీర్ తయారు చేసి, స్వీట్లలో డ్రై ఫ్రూట్స్‌గా కలుపుకొని తింటున్నారు. కొందరు వ్యక్తులు కూరగాయలలో కలుపుకొని తింటున్నారు. మఖానా రుచి చల్లగా ఉంటుంది కానీ ఇది చలికాలం, వేసవి కాలం రెండు కాలాలలోను తింటారు. ఇందులో కొలెస్ట్రాల్, కొవ్వు, సోడియం తక్కువగా ఉంటుంది. అయితే మెగ్నీషియం, కాల్షియం, పిండి పదార్థాలు, ప్రోటీన్లు పుష్కలంగా కనిపిస్తాయి. ఇది కాకుండా మఖానా గ్లూటెన్ రహితంగా ఉంటుంది.
రోజూ ఖాళీ కడుపుతో 4 నుంచి 5 మఖానాలు తింటే శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే గుండెకు ప్రయోజనకరం మీకు గుండె సంబంధిత వ్యాధి ఉంటే మీరు తప్పనిసరిగా మఖానా తినాలని వైద్యులు చెబుతారు. మఖాన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బిపిని నియంత్రిస్తుంది. కానీ మీకు అధిక బిపి సమస్య ఉంటే ఉప్పుతో కలిపి తీసుకోకండి. మఖానా వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇందులోని ఫైబర్ ఆకలి త్వరగా అవకుండా చేస్తుంది.
మఖానాలోని ప్రోటీన్స్, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, తదితర సూక్ష్మ పోషకాలు అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వవు. ముఖ్యంగా కాల్షియం బోన్ హెల్త్ మెరుగుపరుస్తుంది. అలానే రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం శరీరంలోని జీవక్రియ వ్యవస్థను ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా, మెగ్నీషియం నరాల పని తీరుని మెరుగుపరుస్తుంది.
మఖానాలోని గల్లిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఎపికాటెచిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రాణాంతక జబ్బుల నుంచి కాపాడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వాపును కూడా తగ్గిస్తాయి. తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్, సోరియాసిస్ వంటి రోగాలు రాకుండా, వస్తే తీవ్రతరం కాకుండా ఈ గింజలతో ఆపడం సాధ్యమవుతుంది. మఖానాలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.
స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతాయి. స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో ఉన్న ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మఖానా గింజలు కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మఖానాని రోజు వారి డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా మొటిమలు, చర్మంపై ముడతలు రావు. అలర్జీ, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుబ్బరం లాంటి సమస్యలు ఉన్నవారు మాఖానాకి దూరంగా ఉండటం శ్రేయస్కరం.