బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే వారం ముందు కనిపించే కనిపించే సంకేతాలు ఇవే.
స్ట్రోక్ అనేది మెడికల్ పరంగా సీరియస్ కండీషన్, దీని లక్షణాలను త్వరగా గుర్తించడం, ట్రీట్‌మెంట్ అవసరం. మెదడుకు రక్త సరఫరా తగ్గడం, అంతరాయం కలిగించడం వల్ల మెదడు కణాలు చనిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. త్వరగా గుర్తించడం వల్ల మెదడు దెబ్బతినే అవకాశాలను తగ్గించొచ్చు. అయితే ఈ రోజుల్లో ఎక్కువమంది బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణిస్తున్నారు. మెదడులోని ఒక భాగానికి రక్తసరఫరా నిరోధించినప్పుడు.
లేదంటే మెదడులోని రక్తనాళం పగిలిపోయినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా సాధారణంగా ఈ స్ట్రోక్ వస్తుంది. అయితే కొన్ని అంచనాలు రాబోయే ప్రమాదానికి సంకేతాలు. ఈ లక్షణాలను బ్రెయిన్ స్ట్రోక్ గంటల ముందు లేదా రోజుల ముందు కనిపిస్తాయి. 43 శాతం మంది రోగులు బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు ఒక వారం రోజుల ముందు చిన్న స్ట్రోక్ లక్షణాలను అనుభవిస్తారు.
ఈ స్ట్రోక్ అనేది ఒక భాగానికి రక్త సరఫరా లో అంతరాయం కారణంగా సంభవించేది ఇస్కీమిక్ అటాక్. అలాగే ఈ స్ట్రోక్ వచ్చే ముందు సరిగ్గా ఆలోచించ లేకపోవడం, మాట్లాడలేకపోవటం వంటివి జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు .. ఈ సర్వేలో 2475 మందిని పరీక్షించిన తరువాత వారంలోపు స్ట్రోక్ వచ్చిందని తెలుసుకున్నారు.
ఈ స్ట్రోక్ ని ఎలా నియంత్రించవచ్చు అంటే క్రమం తప్పకుండా వ్యాయమం చేయటం , పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. రోజుకి 6 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుకు కారణం అవుతుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం మధ్యపానం అలవాట్లను మానుకోవాలి.