అకస్మాత్తుగా మీ గుండె ఆగిపోకోడదంటే..? ఈ చిన్న పని చేస్తే చాలు మీ గుండె సేఫ్.
గుండెపోటు వచ్చి న సందర్భాల్లో మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం (ఈ ష్మిక్ స్ట్రోక్) ఎక్కువ. చేపలు తినేవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది.చేపల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికమొత్తంలో లభిస్తాయి. గుండె జబ్బులు,ఆర్థరైటిస్, డిప్రెషన్,క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించడంలో ఈ ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రకారం, ప్రపంచంలో అత్యధిక మరణాలు ఉప్పు ఎక్కువగా తినడం వల్లనే వస్తున్నాయని షాకింగ్ వివరాలు ప్రకటించింది.
తాజాగా ఉప్పుకు సంబంధించి ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ తొలిసారిగా ఓ నివేదికను ప్రచురించింది. ఇందులో సోడియం ఎక్కువగా తింటే ఎలాంటి సమస్య వస్తుందో చెప్పుకొచ్చింది. అంటే ఉప్పు తింటే ఏ సమస్య వస్తుందో కూడా స్పష్టంగా పేర్కొంది. 2025 నాటికి 30 శాతం తక్కువ ఉప్పు తినాలనే ప్రచారాన్ని ప్రారంభించాలని ప్రపంచవ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్నట్లు నివేదికల్లో పేర్కొంది.
ఆహారంలో ఎక్కువ ఉప్పు వాడకంతో అనేక రోగాలు.. సోడియం శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కానీ, దీనిని ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, అకాల మరణాలు సంభవించవచ్చని పేర్కొంది. టేబుల్ ఉప్పు (సోడియం క్లోరైడ్)లో ప్రధాన మూలకంగా ఉంటుంది. దీనితో పాటు, ఈ పోషకం సోడియం గ్లుటామేట్ లాంటి ఇతర సుగంధ ద్రవ్యాలలో కూడా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు..
WHO ప్రపంచ నివేదిక ప్రకారం ప్రజల ఆహారం నుంచి ఉప్పును తగ్గించే విధానాలను అమలు చేయడానికి 2030 వరకు పట్టవచ్చని అంచనా వేసింది. ఇలా చేయడం వల్ల ప్రపంచంలోని 70 లక్షల మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపింది. అయితే, కేవలం తొమ్మిది దేశాలు – బ్రెజిల్, చిలీ, చెక్ రిపబ్లిక్, లిథువేనియా, మలేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, స్పెయిన్, ఉరుగ్వే మాత్రమే తక్కువగా ఉప్పు తినేలా ప్రజలకు అవగాహన కల్పించాయి. ఉప్పు తక్కువగా తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం.