బెల్లం-శనగపప్పు కలిపి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న సమతుల్య ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ కోవకు చెందినదే బెల్లం శనగపప్పు. ఇవి రెండు కలిపి తినడం శరీరానికి చాలా మంచిది. ఈ రెండింటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను కూడా దూరం చేయడంతో పాటు ఆనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అయితే మన ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
ఈకోవకు చెందినదే బెల్లం శనగపప్పు. ఇవి రెండు కలిపి తినడం శరీరానికి చాలా మంచిది. ఈ రెండింటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధులను దూరం చేస్తాయి. బెల్లం, శనగపప్పు ప్రయోజనాలు.. బెల్లం పప్పు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇది కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
బెల్లంలో ఐరన్, మాంసకృత్తులు పుష్కలంగా ఉన్నందున రక్తహీనత సమస్య ఉండదు. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. బెల్లం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. శరీరం యొక్క శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడే గుర్ చానా అనేది వ్యాయామం తర్వాత ఒక ఆదర్శవంతమైన చిరుతిండి.
బెల్లం పప్పులో భాస్వరం సమృద్ధిగా ఉంటుంది. ఇది దంతాలు చెడిపోకుండా కాపాడుుతుంది. ఈ రెండింటిలో ఉండే పొటాషియం గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాకుండా బీపీని అదుపులో ఉంచుంది. మూత్ర సమస్యకు బెల్లం మరియు శనగపప్పు మిశ్రమం చెక్ పెడుతుంది. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. ఎముకలను గట్టి పరుస్తుంది.