గుండెపోటు మరణాలపై అసలు విషయం బయటకు చెప్పిన WHO.
ఒక పరిహృదయ ధమనిలో అవరోధం కలిగిన కారణంగా హృదయ కండరం మృతి చెందడాన్నే గుండెపోటుగా భావిస్తారు. పరిహృదయ ధమనిలో బృహద్ధమని కఠినమైన ప్లాక్ ప్రాంతంలో రక్తం గడ్డ కట్టినప్పుడు గుండెపోటు వస్తుంది. గడ్డకట్టిన రక్తం ధమనిని నిరోధించడంతో పాటు రక్త ప్రసరణను నిలిపివేస్తుంది. సంబంధిత ధమని ద్వారా సరఫరా పొందుతున్న హృదయ కండరం వెంటనే ఆమ్లజని కోసం అల్లలాడుతుంది, అంతేకాక కొద్ది గంటల్లో రక్త ప్రసరణ పునరుద్ధరింపబడని పక్షంలో, హృదయ కండరం మరణిస్తుంది. అయితే కొన్ని రోజులుగా గుండెపోటు మరణాల సంఖ్య పెరిగింది. వయసుతో సంబంధమే లేదు.. సడెన్ గా గుండెపోటుతో చనిపోతున్నారు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. గుండెపోటు మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. అసలు గుండెపోటు ఎందుకు వస్తుంది? ఎందుకిలా హార్ట్ పై అటాక్ జరుగుతోంది? కారణం ఏంటి? అనేది మిస్టరీగా మారింది. ఇటీవల కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. ఏదో ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ పరిణామం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెలువరించింది. గుండెపోటు మరణాల పెరుగుదలకు కారణం ఏంటో కూడా తెలిపింది. ఉప్పు అధికంగా వాడడం వల్లే గుండెపోట్లు వస్తున్నాయని WHO వెల్లడించింది. సోడియం (ఉప్పు) మోతాదు హెచ్చితే అనారోగ్య సమస్యలు వస్తాయని వివరించింది. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా… ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు కూడా వస్తాయని సదరు నివేదిక చెబుతోంది.
2025 నాటికి ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం ఆచరణలో కనిపించడంలేదని డబ్ల్యూహెచ్ఓ విచారం వ్యక్తం చేసింది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడొచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది. అయితే సోడియం విషయంలో డబ్ల్యూహెచ్ఓ సిఫారసులను ప్రపంచంలో కేవలం 9 దేశాలే అమలు చేస్తున్నాయి. ఆ దేశాలు ఏవి అంటే.. Brazil, Chile, Czech Republic, Lithuania, Malaysia, Mexico, Saudi Arabia, Spain and Uruguay. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు (సోడియం) మాత్రమే తీసుకోవాలి.
కానీ, అందుకు విరుద్ధంగా ప్రపంచంలో సగటున 10.8 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. హఠాన్మరణాలకు ఇటువంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనోమ్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు (సోడియం) మాత్రమే తీసుకోవాలి. కానీ, అందుకు విరుద్ధంగా ప్రపంచంలో సగటున 10.8 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్టు వెల్లడైంది. హఠాన్మరణాలకు ఇటువంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అథనోమ్ చెప్పారు.