కరోనా తరువాత మరో వైరస్, అప్పుడే 17 మంది చిన్నారులు మృతి.
అడినో వైరస్ ఈ వైరస్ సోకినవారిలో సాధారణ జలుబు, గొంతు మంట, కళ్ల కలక, కడుపునొప్పి, తీవ్రమైన బ్రాంకైటిస్, నిమోనియా వంటి లక్షణాలుంటాయి. గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల ఇబ్బందులున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ వైరస్ సోకితే మెదడు వ్యవస్థ, మూత్ర నాళాలు, కళ్లు, ఊపిరితిత్తులు, పేగులకు హాని కలుగుతుంది. ఇది ఇతర వైరస్‌లానే అంటువ్యాధి. ఇదొక శ్వాసకోశ వైరస్ అని చెప్పవచ్చు. జలుబుతో మొదలై తీవ్ర అనారోగ్యం, శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది.
చర్మం, గాలి, నీరు ద్వారా విస్తరిస్తుంది. దగ్గు, తుమ్ము ద్వారా ఎదుటి వ్యక్తులకు అంటుకుంటుంది. అయితే పశ్చిమ బెంగాల్లో కలకలం రేపుతోందీ అడినో వైరస్. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనూహ్యంగా వ్యాప్తి చెందుతోంది. అడినో వైరస్ బారిన పడి ఇప్పటికే అక్కడ 17 మంది పిల్లలుమృత్యువాత పడ్డారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారందరిలోనూ అడినో వైరస్ లక్షణాలు కనిపించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. కరోనా వైరస్‌ను పోలివుండే లక్షణాలు దీనికి ఉన్నాయి.
వైరస్ సోకిన వెంటనే శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి.చిన్నారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది..న్యమోనియా సంబంధిత ఇబ్బందులకు ఈ వైరస్ కారణమౌతోంది.పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సర్కార్ ఆదేశించింది. మూడేళ్లుగా ఏదో ఒక వైరస్ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది.ఇప్పుడు పశ్చిమబెంగాల్లో అడినో వైరస్ వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆసుపత్రుల్లో చేరుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే అడినో వైరస్‌కు ఇప్పటి వరకూ ఏ విధమైన మందు కనిపెట్టలేదు. సాధారణ జలుబు, జ్వరం, నిమోనియాలకు వాడే మందులే ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో ఎలాంటి రక్షణ అవసరమో అవే జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా మహమ్మారి విషయంలో తీసుకునే జాగ్రత్తలన్నీ పాటించాలి. ఈ వ్యాధి నుంచి రక్షించుకునేందుకు ఇమ్యూనిటీ పెంచుకోవడమే తక్షణ కర్తవ్యం. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఈ వ్యాధి దరిచేరదు. దీనికోసం విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మకాయ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, క్యారెట్, అల్లం, బీన్స్, వెల్లుల్లి, ఆకుకూరలు తరచూ తీసుకోవాలి.