Health

ఈ కాలంలో మట్టి కుండలోని నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుసుకోండి.

పూర్వకాలంలో నీళ్ళను ఈ మట్టి కుండలలోనే స్టోర్ చేసి తాగేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఎండాకాలం వచ్చిదంటే ఓన్లీ ఫ్రిజ్ వాటర్. అలా కూల్ వాటర్ తాగడం వల్ల వెంటనే చాలా హాయిగా అనిపిస్తుంది కానీ.. కొంతకాలం తర్వాత అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలున్నాయి. రిఫ్రిజిరేటర్ లోని చల్లటి నీరు తాగడం వల్ల అకస్మాత్తుగా గొంతు కణాల ఉష్ణోగ్రత పడిపోతుంది, గొంతు నొప్పితో పాటు జలుబు చేసే అవకాశం ఉంది. మట్టి కుండలో నీళ్ళను తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది మట్టి కుండలో నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి ప్రారంభమైంది. మార్కెట్లో కొన్ని చోట్ల ఈ మట్టి కుండలు లభిస్తున్నాయి. అలాగే.. ఇటీవల కాలంలో మట్టి పాత్రలతోపాటు.. మట్టి గ్లాసులు, మట్టి బాటిల్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే కుండల తయారీకి వాడే మట్టి.. నీటిని సహజంగా ఫిల్టర్ చేస్తుంది.

ఇందులో పోరస్ లక్షణాలు ఉంటాయి. ఇవి నీటి నుంచి మలినాలను, కలుషితాలను తొలగిస్తాయి. ఇవి నీటిని శుభ్రంగా చేస్తాయి. తాగేందుకు అనుకూలంగా మార్చుతాయి. కుండల తయారీకి వాడే మట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి. ఇవి నీటిలో pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. నీరు మరింత ఎక్కువ ఆల్కలీన్ అవుతుంది. ఆల్కలీన్ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది జీర్ణక్రియను పెంచుతుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది, పొట్టలో యాసిడ్ తగ్గేలా చేస్తుంది.

కుండ మట్టిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నీటిలోకి వెళ్లి అదనపు పోషక ప్రయోజనాలను అందిస్తాయి. మట్టి కుండలు… వేడి వాతావరణంలో కూడా నీటిని చల్లగా, తాజాగా ఉంచుతాయి. చల్లటి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ అవుతుంది. ఈ నీటిని తాగితే వడదెబ్బ తగిలే అవకాశం తక్కువ. చర్మం పొడిబారే (డీహైడ్రేషన్) అవకాశమూ తక్కువే.

మట్టి కుండల వల్ల పర్యావరణానికి నష్టం అనేదే ఉండదు. ప్లాస్టిక్ కంటైనర్ల కంటే వీటిని వాడటం మేలు. మట్టి కుండలు త్వరగా భూమిలో కలిసిపోగలవు. మట్టి కుండలకు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. ఈ కన్నాల నుంచి గాలి కుండలోపలికి వెళ్తుంది. తద్వారా లోపలి నీరు చల్లగా అవుతుంది. ఇలా సహజంగా చల్లబడే నీరు తాగడం వల్ల శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ ఉండవని నిపుణులు తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker