రోజు రెండు లవంగాలు తింటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.
దగ్గు ఎక్కువగా ఉన్నపుడు.. టీలో శొంఠికి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు వీటిని వేయించి పొడిచేసి తేనెలో కలిపి తీసుకుంటే జీర్ణము అవుతుంది. మూడు లీటర్ల నీళ్ళలో నాలుగు గ్రాముల లవంగాలు వేసి నీళ్లు సగం అయ్యేవరకు మరిగించి తాగితే కలరా విరేచనాలుతట్టుతాయి. ఆరు లవంగాలు కప్పు నీళ్లు కలిపి డికాక్షన్ తయారుచేసి ..చెంచాకు కొంచం తేనే కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ” ఉబ్బసము ” తగ్గుతుంది.
పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది, వంటకాలలో దీనిని ఉపయోగించడం వల్ల చర్మ కాన్సర్ ను తగ్గించవచ్చును, దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరములో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే లవంగాలు ఆహార పదార్థాలకు చక్కని రుచి, సువాసనను అందించడంతోపాటు అనేక ఆరోగ్య లాభాలను చేకూరుస్తాయి.లవంగం తినడానికి చాలా ఘాటుగా ఉంటుంది. లవంగాలను తినడం వలన మనం జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
జీర్ణాశయం ప్రేగులు చక్కగా శుభ్రపడతాయి. గ్యాస్,అసిడిటీ, అజీర్ణం, వికారం వంటివి తగ్గిపోతాయి. తిన్న ఆహారం సక్రమంగా జరిగిన సమస్య తగ్గిపోతుంది.లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఇది అనేక సూక్ష్మజీవులు మరియు ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను దూరం చేస్తాయి.
లవంగాలను క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ను శుద్ధి చేస్తాయి. అలానే శరీరంలో మెటబాలిజం రేటును మెరుగుపరుస్తాయి. దీంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు, చెడు కొలెస్ట్రాల్ బయటకు పోయి,గుండా ఆరోగ్యంతో ఉంటుంది. లవంగాలను షుగర్ వ్యాధిగ్రస్తుల పాలిట ఒక అద్భుత వరమని చెప్పవచ్చు.లవంగాలలో ఉండే ఇన్సులిన్ వంటి సుగుణాలు రక్తంలో ఉండే గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి.
అందువల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది.లవంగాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను మెండుగా కలిగి ఉంటాయి. లవంగాలను నమిలి తినడం వలన దంతాలు మరియు చిగుళ్ల సమస్యలు సమసిపోతాయి. దంతాలు,చిగుళ్ళు దృఢంగాతయారవుతాయి.నోటి దుర్వాసన పోతుంది.అలానే లవంగాలు తెల్ల రక్త కణాల వృద్ధికి సహాయపడతాయి. డయేరియా పెద్ద ప్రేగులలో ఏర్పడే పరాన్న జీవుల సమస్యను నివారిస్తాయి. ఇందులో ఉండే లక్షణాలు ఎముకలు గుల్లబడే సమస్యను నివారిస్తాయి. తామర వంటి చర్మ వ్యాధులను వివరిస్తాయి.