Health

ఫ్లూ బారిన పడినప్పుడు పొరపాటునకూడా ఈ తప్పులు చేయొద్దు. ఎందుకంటే..?

ఇది ఒక వైరస్ వల్ల కలిగే జబ్బు . దీనివల్ల ప్రాణ హాని కలుగదు కాని రకరకాల వ్యాధులకు ఇది దారి తీయవచ్చు. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఇన్‌ఫ్లుయోంజా క్రిములు శరీరంలోకి ప్రవేశించి రెండు మూడు రోజులలోనే అపరిమితంగా వృద్ధిపొందుతాయి. ఆ క్రిములు వెలిగ్రక్కే విషం శరీరంలో హెచ్చు తుంది. అందువల్ల శరీరావయవాలన్నీ క్రుంగిపోతాయి. అయితే బయట తిరగకుండా ఉండాలి ఫ్లూ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చల్లటి వాతావరణం ఉంటే అసలు బయటకి రావద్దు. ఇంట్లోనే ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. చదవడం, టీవీ చూడటం, మనసుకి హాయినిచ్చే సంగీతం వినడం వంటివి చేసుకోవచ్చు.

ఆఫీసుకి వెళ్ళడం బయట స్నేహితులు, బంధువులను కలవకుండా ఉండాలి. లేదంటే వారికి ఫ్లూ అంటుకుని వ్యాపించడం ప్రారంభమవుతుంది. ద్రవాలు తక్కువగా తీసుకోవద్దు.. ఫ్లూ నుంచి త్వరగా బయటపడాలంటే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలపు సూపు( చికెన్ సూప్ వంటివి), కెఫీన్ లేని హాట్ హెర్బల్ టీలు అల్లం టీ, చామంతి పూల టీ వంటివి ఫ్లూ తో పోరాదమలూ కీలకమైనవి. అలాగే నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, తాజా పండ్ల రసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి.. అనారోగ్యంగా ఉన్నప్పుడు తిండి మీదకి ధ్యాస తక్కువగా ఉంటుంది.

కానీ రోగానని ఎదుర్కోవాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. నారింజ, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి సీజనల్ పండ్లు తినాలి. ఆకుకూరలు, తాజా కూరగాయలు తినాలి. కారంగా ఉండే మిరియాలు, అల్లం వంటి వాటిని తినాలి. ఇవి వాపుని, నొప్పిని తగ్గిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఫ్లూ లక్షణాలు నుంచి ఉపశమనం పొందేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. ఉదాహరణకి ముక్కు మూసుకుపోయినట్టుగా ఉంటే వేడి నీటితో స్నానం చేయడం, ఆవిరి పట్టడం చేయాలి.

ఇవి నాసికా రంధ్రాలు క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని కలిసి సరైన చికిత్స తీసుకోవాలి. వ్యాక్సినేషన్ ముఖ్యం.. ఇన్ ఫ్లూఎంజా అనేది టీకా ద్వారా నివారించగలిగిన వ్యాధి. రోగనిరోధక శక్తిని పెంచుకుని ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు టీకాలు తీసుకోవడం మంచిది. పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఇన్ఫ్లూఎంజా బారిన పడకుండా పూర్తిగా టీకాలు తీసుకోవచ్చు. పిల్లల కోసం పీడియాట్రిక్ టీకా షెడ్యూల్ ని అనుసరించాలి. ఇక పెద్ద వాళ్ళు అయితే వార్షిక ఫ్లూ షాట్ ని పొందాలి.

ఫ్లూ వైరస్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున టీకాలు తీసుకోవడం చాలా అవసరమని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తుంది. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించి చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. బయట నుంచి వచ్చిన వెంటనే కళ్ళు లేదా ముక్కు, నోటిని తాకకుండా చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అనారోగ్యంగా ఉన్న వారికి దూరంగా ఉండటం మంచిది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ లు ధరించి తిరగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker