Health

జ్వరం వచ్చిన వెంటనే పిల్లలకు మాత్రలు వేస్తె ఎంత ప్రమాదమో తెలుసా..?

శరీరం వేడిగా మారటం మూలంగానే ఒంట్లో ఉన్న వైరస్‌ వంటి వ్యాధికారకాలు ఎన్నో చనిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చి… బిడ్డ చాలా అసౌకర్యంగా ఉన్నప్పుడే జ్వరం తగ్గించే మందులు వెయ్యాలి. ఒళ్లు వేడిగా ఉన్నా పిల్లలు బాగానే తిరుగుతుంటే దాన్ని పట్టించుకోనక్కర్లేదు. పిల్లలు డల్‌గా ఉన్నా, చికాకుగా ఉన్నప్పుడు మాత్రమే ప్యారాసిటమాల్‌ మాత్రను మింగిచాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనిషికి జ్వరం రావడం సహజం. అది వచ్చిన వెంటనే మాత్రలు వాడటం కూడా ఓ అలవాటుగా మారింది.

చిన్నగా జ్వరం వచ్చిందంటే చాలు పారాసిటమల్ మాత్ర వేసుకోవడం ఓ ఆనవాయితీగా మారింది. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. తక్కువ జ్వరం వచ్చినా మాత్రలు వాడటం సమంజసం కాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 100 దాటినా సహజంగా తగ్గేందుకు ప్రయత్నించాలి. కానీ మాత్రలు వాడటం సరైంది కాదని చెబుతున్నారు. చీటికి మాటికి గోలీలు వేసుకోవడం అనారోగ్యాలకు దారి తీస్తుంది. ప్రతి నలుగురిలో ఒకరు జ్వరం రాగానే రెండో డోసు ఇస్తున్నారు.

స్వల్ప జ్వరాలకు కూడా మాత్రలు వాడాలనుకోవడం తగ్గించుకోవాలి. ఎక్కువగా మందులు వాడితే దుష్ఫలితాలు చోటుచేసుకుంటాయి. పన్నెండేళ్ల లోపు చిన్నారులకు మాత్రలు వేయడం మానుకోవాలి. వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాలు చూపడంలో మాత్రల పాత్ర ఉంటుంది. తల్లిదండ్రులు గమనించి వారికి మాత్రలు ఇవ్వకుండానే సహజ పద్థతుల్లో తగ్గిపోయేందుకు ప్రయత్నించాలి కానీ మాత్రలు వేసుకునేందుకు మొగ్గు చూపొద్దు. ఈ నేపథ్యంలో జ్వరం రాగానే మందులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

స్వల్ప జ్వరాలు వాటంతట అవే తగ్గేలా చూసుకోవాలి. మందులు ఇవ్వడం వల్ల ప్రతికూలతలు కనిపిస్తాయి. పిల్లలకు జ్వరం రాగానే ఆందోళన చెందవద్దు. సహజంగా తగ్గేందుకు మార్గాలు అన్వేషించాలి. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరమే. కానీ అత్యవసర పరిస్థితిలో అయితే మందులు వాడుకోవచ్చు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మాత్రలు వాడుకోవద్దు. మాత్రల జోలికి వెళ్లకపోవడమే మంచిది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం అవసరమే. కానీ వారి ఆరోగ్యం కాపాడుకునే చర్యలు తీసుకోవాలి.

అందుకు తగిన ఆహారాలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. మందులు వాడకం వల్ల దుష్ఫలితాలు చోటుచేసుకుంటాయి. దీనికి అందరు సహజ పద్ధతులు తీసుకోవాలి. మందులకంటే ఆహారాలే తీసుకునేందుకు చొరవ చూపాలి. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే చిన్న పిల్లల భవిష్యత్ పై ఆందోళన చెందకుండా మాత్రలకు దూరంగా ఉంచుకోవడమే శ్రేయస్కరం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker