ఈ చిట్కాలు పాటిస్తే జీవితంలో జుట్టు తెల్లబడకుండా ఉంటుంది.
కేశాలు ఎంత బాగా ఉంటే అంత అందంగా కనిపిస్తారు. జుట్టు ఎంత బాగుంటే అన్ని రకాల హెయిర్ స్టైల్స్‌ను ఫాలో అవుతారు. అయితే జుట్టు ఆడవారిలోనే కాదు మగవారికీ అందాన్ని చేకూరుస్తాయి. కాకపోతే మగవారు బట్టతల వస్తుందని తెలిసే సరికి పట్టించుకోవడం మొదలెడతారు. ఇక సెలెబ్రెటీలైతే సరే సరి వారి కోసం పర్సనల్ హెయిర్ స్పెషలిస్టులను పెట్టుకుంటారు. అయితే ఇటీవల కాలంలో జుట్టు తెల్లబడటం, రాలిపోవడం వంటి సమస్యలతో యువత సతమతమవుతున్నారు. ఎప్పుడో యాభై ఏళ్లకు రావాల్సిన బట్టతల చిన్న వయసులోనే వస్తోంది. ఫలితంగా నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జుట్టు సంరక్షణకు ఏవేవో మందులు వాడుతూ ఇంకా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఏవో హెయిర్ డై లు వాడుతూ ఉన్న జుట్టును ఊడిపోయేలా చేసుకుంటున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయి. ఇంటి చిట్కాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇంకా కొత్త సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా ఉండాలంటే మన ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కా ఉంది. దీని కోసం ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. డికాషన్ పొయ్యి మీద పెట్టి గ్లాస్ నీరు పోసం ఒక స్పూన్ టీ పొడి వేసి ఐదు నిమిషాలు మరిగించి వడకట్టాలి.
ఒక బౌల్ లో తీసుకుని రెండు స్పూన్ల పొడి, ఒక టీ స్పూన్ పెరుగు, టీ డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంట సేపు అలా ఉంచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇంగ్లిష్ మందులతో..ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. కాకపోతే సహనంతో దీన్ని తయారు చేసుకోవాలి.
హెన్నా కూడా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. జుట్టు ఒత్తుగా బలంగా ఉండాలంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కానీ చాలా మంది ఇంగ్లిష్ మందులతో ఇంకా జుట్టును ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. వాటిని పాటించి జుట్టును నల్లగా చేసుకుంటే సరి. వంటింటి చిట్కాలతోనే.. మన వంటింట్లోనే ఎన్నో రకాల మందులు ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల మనకు మేలు కలుగుతుంది.
జుట్టు రాలకుండా తెల్లబడకుండా చేసుకోవడంలో ఇతర మందులకన్నా వంటింటి వైద్యమే మిన్న అని గుర్తించాలి. లేకపోతే జుట్టు సమస్యలు తగ్గవు. ఇదివరకు మనం ఎన్ని రకాలైన మందులు వాడినా దీన్ని కూడా ఓ సారి ప్రయత్నించి చూస్తే దాని ఫలితం కనిపిస్తుంది. జుట్టు రంగు మారిందంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకే చిట్కాలు పాటించి జుట్టు సమస్యలను దూరం చేసుకోవాల్సిన అవసరం మనదే అని గుర్తుంచుకోవాలి.