కిర్రాక్ ఆర్పీ చేపల పులుసుపై భారీ కుట్ర, ఆ విష ప్రచారంతోనే..?
కిర్రాక్ ఆర్పీ..కొత్తలో కొంతకాలం జబర్దస్త్ ద్వారా పేరు సంపాదించుకున్న ఈయన ఆ తర్వాత జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి జబర్దస్త్ ను విమర్శించిన విషయం తెలిసిందే. జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత వేరే ఛానల్స్ కి వెళ్లారు. కానీ అక్కడ వర్క్ అవుట్ కాక సొంతంగా బిజినెస్ లోకి అడుగుపెట్టారు ఆర్ పీ.. ఇటీవల కిర్రాక్ ఆర్పి “నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు” పేరుతో హైదరాబాదులో పెద్ద ఎత్తున ఒక కర్రీ పాయింట్ ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే కిర్రాక్ ఆర్పీ..నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ సొంతంగా బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. మొదట కూకట్‌పల్లిలో ప్రారంభించిన ఈ ఫుడ్ సెంటర్‌కు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. బౌన్సర్లతో కస్టమర్లను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ సమస్యలూ తలెత్తాయి. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ బ్రాంచ్ మూత పడింది. అయితే హంగులతో తిరిగి వారంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపును రీ ఓపెన్ చేశాడు.
కాగా ఈ మధ్యన తన ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ రుచి అసలు బాలేదని కొంతమంది పనికట్టుకొని లేని పోని ప్రచారం చేస్తున్నారని కిర్రాక్ ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనంటే పడని కొందరు పెయిడ్ బ్యాచ్ తనపై కుట్ర పన్నారని, అందుకే ఈ విష ప్రచారానికి పాల్పడుతున్నారన్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను.
కానీ ఈ మధ్యన కొందరు పెయిడ్ బ్యాచ్ నా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫుడ్ సెంటర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారు. మోసం చేసి ఎన్నాళ్లు బిజినెస్ చేయలేరు. నేను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా. షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఎంతో మంది కస్టమర్లు రుచి ఎంతో బాగుందంటూ వందలాది మంది కొత్త కస్టమర్లను వెంటపెట్టుకొని మరీ వస్తున్నారు. టెస్ట్ లేకపోతే తన కర్రీ పాయింట్ వద్దకు ఎవరూ రారు.
అయితే ఒక్కడు బాగాలేదని నెగెటివ్ కామెంట్లు చేయడమంటే ఆ వ్యక్తి ఎంత ఓర్వలేనివాడో ఇట్టే అర్థమవుతుంది. నేను చేపలు పులుసు తయారు చేస్తూ నా కిచెన్ లో ఎన్నో వీడియోలు తీశాను. అవే నా నిజాయతీకి నిదర్శనం. నన్ను ఎవరూ బ్యాడ్ చేయలేరు. ఎంత నెగిటివ్ చేస్తే.. నాకు అంత ప్రమోషన్’ అని అంటున్నాడు ఆర్పీ.