Health

ప్రాణాయామం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే అంటే సంగతులు.

ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని విసరింపజేసి అదుపులో ఉంచడం. ప్రాణము అనగా జీవనము, ఆయామము అనగా పొడిగించుట. ప్రాణాయామం మనస్సును ఏకాగ్రం చేయడానికి, శరీరాంతర్గత నాడీ శుద్ధికి తోడ్పడుతుంది. పతంజలి మహర్షి ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలను అదుపులో ఉంచడం ప్రాణాయామమని నిర్వచించారు. స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపికలో, పాతంజలి యొగశాస్త్రంలో కూడా ప్రాణాయామం చెప్పబడెను.

అయితే ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి వివిధ పద్ధతులను అనుసరిస్తారు. అందులో కొందరు ప్రాణాయామాన్ని ఆశ్రయిస్తారు. ఇది శ్వాసకి సంబంధించినది. చాలా ప్రభావవంతమైనది కూడా. ప్రాణాయామం సహాయంతో చాలా వ్యాధులను సులభంగా నివారించవచ్చు. కానీ సరిగ్గా చేయాలి. కొంతమంది ప్రాణాయామం సమయంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

కళ్ళు తెరవడం కొంతమంది ప్రాణాయామం చేస్తున్నప్పుడు మధ్యమధ్యలో పదే పదే కళ్ళు తెరుస్తారు. ఇలా చేయకూడదు దీనివల్ల దృష్టి దెబ్బతింటుంది. అంతేకాదు ప్రాణాయామ ఫలితం కూడా దక్కదు. ప్రాణాయామం పూర్తయ్యేవరకు కళ్లు మూసుకొనే ఉండాలి. ఆసనాలు మార్చడం ప్రాణాయామం చేసేటప్పుడు చాలాసార్లు ఆసనాలను పదే పదే మారుస్తారు. ఇలా చేయడం మంచిదికాదు.

దీనివల్ల మీ దృష్టి మరలుతుంది ప్రాణాయామం పూర్తి ప్రయోజనం పొందలేరు. శ్వాసపై శ్రద్ధ చూపకపోవడం మీరు ప్రాణాయామం చేసినప్పుడు ప్రతి ఆసనంలో శ్వాసపై దృష్టి ఉంటుంది. కానీ కొంతమంది ప్రాణాయామం మాత్రమే ఆచరిస్తారు శ్వాసపై శ్రద్ధ చూపరు. దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

దంతాలు కదపడం ప్రాణాయామం చేస్తున్నప్పుడు దంతాలను కదపకూడదు. ఇలా చేయడం వల్ల ప్రాణాయామం ప్రయోజనం లభించదు. కొంత మంది సమయాభావం వల్ల ప్రాణాయామం హడావిడిగా చేస్తారు. దీనివల్ల ప్రయోజనం ఉండదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker