బెంగళూరులో తారకరత్న వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు నారాయణ హృదయాలయ వైద్యులు చెబుతున్నారు. నిపుణులైన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన నటుడు కావడం.. అందులోనూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న సందర్భంలో గుండెపోటు బారిన పడిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గత వారం రోజులుగా బెంగళూరులోనే మకాం వేసి నారాయణ హృదయాలయలో వైద్యుల బృందంతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు.
అయితే వారం రోజులు గడుస్తున్నా అతను ఇంకా స్పృహలోకి రాలేదు కానీ పెద్ద ప్రమాదమైతే తప్పిందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో నందమూరి అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తారకరత్న పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతోందని, మెరుగైన చికిత్స అందించడానికి ఇప్పటికే కోటి రూపాయలకు పైగా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయని తెలుస్తోంది.
అయితే ఈ ఖర్చులను స్వయంగా నారా లోకేష్ భరిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. నారా చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ కూడా తారకరత్న కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారనే విషయం అయితే బయటకొచ్చింది. ఇంకా ఎంత ఖర్చు అయినా ఆయన పూర్తి ఆరోగ్యంగా తిరిగి వచ్చే వరకు తమ బాధ్యతే అని మాటిచ్చినట్లు తెలుస్తోంది.
తారకరత్నకు చికిత్స జరుగుతోన్న ఆస్పత్రిలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహనకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. గతంలో తారకరత్నకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది అనుకోకుండా జరిగింది. బ్యాడ్ లక్. హార్ట్ స్ట్రోక్ రావడంతో షాక్ కు గురయ్యాడు.
ఆయన త్వరగా కోలుకోవాలని మనం ప్రార్ధిద్దాం అని తారకరత్న సోదరుడు చైతన్య కృష్ణ చెప్పారు. తారకరత్న వైద్యంలో మిరాకిల్ జరిగిందని నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిన.. తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం మిరాకల్ అని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్ని బాగానే ఉన్నాయి అని బాలయ్య బాబు చెప్పారు. తారకరత్న ఆసుపత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి బాలకృష్ణ అక్కడే ఉండి కుటుంబానికి ధైర్యం నింపుతున్నారు.