షూటింగ్ లో చెయ్యి విరగ్గొట్టుకున్న స్టార్ డైరెక్టర్.
తాజాగా సినీ డైరెక్టర్ సుధాకొంగరకు ఈ సినిమా షూటింగ్ లో ప్రమాదం జరగగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చేతికి పెద్ద దెబ్బ తగిలింది. దీంతో చేతికి ఆపరేషన్ చేసి కట్టు వేసినట్టు తెలుస్తుంది. కట్టు వేసిన తన చేతి ఫోటోలని సుధా కొంగర సోషల్ మీడియాలో షేర్ చేసి.. చాలా నొప్పిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది.
దీనివల్ల నెల రోజుల పాటు రెస్ట్ అని పోస్ట్ చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుధా కొంగరకు ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెల రోజుల పాటు బెడ్ రెస్ట్ అవసరమని తెలిపారు.
ప్రస్తుతం ‘సూరరై పోట్రు’ సినిమా హిందీ రీమెక్ షూట్లో జరిగిన ప్రమాదంలో చేతికి గాయమయ్యిందని సమాచారం. గాయంతో విపరీతమైన నొప్పి ఉందని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపింది. ఆ ఫోటోలు చూస్తే చేతికి బలమైన గాయాలైనట్లు కనిపిస్తోంది.
గురు’, ‘ఆకాశమే నీ హద్దురా’ లాంటి సూపర్‌హిట్ మూవీస్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారామె. ప్రస్తుతం ‘సూరరై పోట్రు’ సినిమా హిందీ రీమెక్ తెరకెక్కిస్తుండగా అక్షయ్ కుమార్ లీడ్రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధిక మదన్ నటిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆమె వెల్లడించలేదు. మరోవైపు ఈ స్టార్ డైరెక్టర్ తమిళ హీరో సూర్యతో మరో ప్రాజెక్ట్ తీయడానికి రెడీ అయ్యారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Super painful. Super annoying! On a break for a month 😒 #NotTheKindOfBreakIWanted pic.twitter.com/AHVR4Nfumf
— Sudha Kongara (@Sudha_Kongara) February 5, 2023