News

తారకరత్న ఆరోగ్యపరిస్థితి కీలక విషయాలు చెప్పిన కుటుంస సభ్యులు.

బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొంతున్నారు. తాజాగా వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టుగా డాక్టర్లు ప్రకటించారు. తారకరత్నకు ఎక్మో సపోర్ట్ అందించడం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ తోపాటుగా ఇతర అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స చేస్తున్నట్టుగా వెల్లడించారు.

అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చికిత్స కొనసాగుతోందని చెప్పారు. తారకరత్నకు ఎక్మో సపోర్ట్ ఇవ్వలేదని తెలిపారు. కార్డియాలజిస్టులు, ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో తారకరత్నకు వైద్యం అందుతోంది.

గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్‌ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు.

గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్‌ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్‌గా మెదడు స్కానింగ్‌ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్‌మెంట్‌ అందించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్‌ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker