Health

అల్జీమర్స్ వ్యాధి ఎలాంటి వారికీ వస్తుందో తెలుసుకోండి.

చాలామంది వయసు మళ్ళిన వారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ వ్యాధి మన జీవితాన్ని తలకిందులు చేస్తుందని. వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్‌ వ్యాధికి దారి తీయవు. అయితే ప్రస్తుతం మతిమరుపు సమస్య అందరిని వేధిస్తోంది. పూర్వం రోజుల్లో వయసు మళ్లిన వారికి అల్జీమర్స్ జబ్బు ఉండేది. మారుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు అందరిలో ఈ జబ్బు కనిపిస్తోంది. ఏదైనా చెబితే మరిచిపోవడం కామన్ అయిపోయింది. దీన్ని రెండు రకాలుగా చెబుతారు.

ఒకటి అల్జీమర్స్ మరొకటి డెమెంటియా అని పిలుస్తుంటారు. ఇవి నెమ్మదిగా మన మెదడు పనితీరును తగ్గిస్తాయి. దీంతో మనకు ఏ విషయం కూడా గుర్తుండదు. మనం నిద్రపోయే తీరును బట్టి కూడా ఈ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొందరు నిద్రపోవడానికి చాలా కష్టపడతారు. కళ్లు మూసుకుని ఉంటున్నా నిద్ర మాత్రం రాదు. ఒకవేళ నిద్రపోయినా రాత్రుళ్లు కలవరించడం చేస్తుంటారు.

మధ్యలో లేచి పక్కన ఉన్న వారిని కొట్టడం, గట్టిగా అరవడం లాంటివి చేస్తుంటే వారికి డెమెంటియా లక్షణం కావచ్చని అనుమానించాల్సిందే. డెమెంటియా ఉన్న వారు జ్ణాపకశక్తిని కోల్పోతారు. దీంతో వారికి ఏదీ గుర్తుండదు. గతంలో జరిగిన సంఘటనలు ఏవీ కూడా గుర్తుకు రావు. నిద్రలో అన్ని గుర్తుకు వస్తాయి. నిద్రపోయిన గంటన్నర తరువాత వీరు ఇలాంటివి చేస్తుంటారు. ఎందుకంటే వీరికి గాఢమైన నిద్ర పట్టదు. కలలో ఏవో చేస్తున్నట్లు అనిపించి నిజంగా కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు.

సరిగా నిద్ర పట్టకనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. పక్కన ఉన్న వారికి మాత్రం భయం పట్టుకుంటుంది. ఈ సమస్యతో బాధపడేవారు నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. ప్రశాంతంగా నిద్ర పోలేరు. నిద్రలోకి జారుకున్నా ఎక్కువ సేపు ఉండలేరు. ఏవో కలలు పడుతూ వారిని కుదురుగా ఉండనివ్వవు. ఇలాంటి సమస్యలు ఉన్న వారు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.

రోగానికి సరైన చికిత్స తీసుకోవాలి. లేదంటే జబ్బు ముదిరితే ప్రమాదమే. మానసికంగా దెబ్బతింటారు. పిచ్చివారిగా ముద్ర పడాల్సి వస్తుంది. ఫలితంగా మెంటల్ ఆస్పత్రిలో చేర్పిస్తారు. అందుకే ముందే గ్రహించుకుని ఈ సమస్య ఉండే సరైన పరిష్కారం కనుగొనాలి. మంచి చికిత్స తీసుకుని జబ్బును దూరం చేసుకుని మంచి జీవితం గడిపేందుకు ప్రయత్నించాలి. అంతేకాని వ్యాధి ముదిరాక చికిత్స చేసినా ప్రయోజనం దక్కదు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker