Health

ఈ లక్షణాలు ఉంటె క్యాన్సర్ కావొచ్చు, ముందుగా గుర్తిస్తేనే జయించవచ్చు.

శరీరంలో కణాలు అసాధారణంగా పెరుగుదల వల్ల కణితులు ఏర్పడతాయి. ఇది శరీరంలో అవయవాలపై, కణాలపైనా ప్రభావం చూపిస్తుంది. ఈ క్యాన్సర్ శరీర భాగాలకు వ్యాప్తి చెందటం, లేకుంటే ఒకేచోట పెరగి గడ్డలుగా ఏర్పడుతుంది. వివిధ రకాలైన క్యాన్సర్లకు కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. క్యాన్సర్ వచ్చిన వారిలో శరీరంలో వచ్చి ప్రాంతాన్ని బట్టి దాని ప్రభావానికి సంబంధించి లక్షణలు కనిపిస్తాయి. అయితే క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని, కానీ చాలామంది చివరి దశలో గుర్తించి తమ జీవితాన్ని కోల్పోతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.. క్యాన్సర్ మొదటి దశలో కనిపించే లక్షణాలను సీరియస్ గా తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

క్యాన్సర్ తొలిదశలో విపరీతమైన అలసట, ఆకలి తగ్గడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, రొమ్ము లేదా శరీరంలోని ఇతర భాగం గట్టి పడటం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.. వీటిని గమనించి పరీక్షలు చేయించుకుంటే మంచిది. క్యాన్సర్ మొదటి దశలో బరువు తగ్గుతారు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందుతున్నప్పుడు మెటా స్టేజ్ లు విస్తరిస్తున్న సమయంలో క్యాన్సర్ కణాలు వాటి జీవ క్రియ కోసం సాధారణ కణాల కంటే ఎక్కువగా శక్తిని కోల్పోతాయి.. దీనివల్ల శరీరంలో ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి.. దీంతో అకస్మాత్తుగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కణాల వృద్ధి కారణంగా వికారం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

దీంతో ఆహారం తీసుకోవడం తక్కువవుతుంది. దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయి.. వాతావరణంలో మార్పు, కొన్ని వ్యాధుల వల్ల దగ్గు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.. బ్రాంకైటిస్, ఆస్తమా, కోవిడ్, క్షయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ దగ్గుకు కారణం కావచ్చు.. నాలుగు వారాలకు పైగా కొనసాగుతుంటే, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడాల్సి ఉంటుంది.. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతం కావచ్చు.. వెంటనే పరీక్షలు చేయించుకోవడం మంచిది. సాధారణంగా ఫైల్స్ సమస్య ఉంటే తప్ప మలం నుంచి రక్తం ఎప్పుడూ పడదు.. మలం నుంచి రక్తం పడితే కంగారుపాల్సిన విషయమే. ఇది పెద్ద పేగు, కొలన్ క్యాన్సర్, ఇంట స్టైనల్ వాల్ క్యాన్సర్ సిగ్నల్ కావచ్చు. క్యాన్సర్ నిర్ధారణ తర్వాత చాలామంది ఆందోళన, నిరాశకు గురవుతూ ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.. కానీ బ్రెయిన్ ట్యూమర్ మొదటి దశలోనూ ఆందోళన, నిరాశ వెంటాడుతూ ఉంటాయి.

నెలసరి సమయంలో కాకుండా బ్లీడింగ్ అవుతున్నట్లయితే అది హార్మోన్ల అసమతౌల్యానికి సంకేతం మాత్రమే కాదు… ప్రమాదకర వ్యాధులకు సంకేతం.. ముఖ్యంగా మోనో పాజ్ సమయంలో రక్తస్రావం అవుతుంటే… ఇది కాకుండా, కోయి టల్ బ్లీడింగ్, పెరి మెనో పౌసల్ బ్లీడింగ్, ఇంటర్ మెన్ స్ట్రువల్ బ్లీడింగ్ ను తేలికగా తీసుకోకూడదు.. ఎందుకంటే ఇది గర్భాశయ క్యాన్సర్ కు సంకేతం. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో దాదాపు 90 శాతం మందికి నెలసరి కాకుండా బ్లీడింగ్ అవుతుంది.. అండాశయ క్యాన్సర్ లోనూ క్షణం కనిపిస్తుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ మొదటి దశలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

అలసట, విశ్రాంతి తీసుకున్నప్పటికీ తగ్గకపోవడం, కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిగా అనిపించకపోవడం, ఆహారం మింగడంలో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు, శరీరంలో ఎక్కడైనా వాపు లేదా గడ్డలు, అమ్మ లేదా శరీరంలోని ఇతర భాగంలో గట్టిపడటం, ఏ కారణం లేకుండా నొప్పి, నొప్పి తగ్గకుండా అధ్వానంగా మారటం, కొత్త పుట్టుమచ్చ, పుట్టుమచ్చలో మార్పు, పుండ్లు నయం కాకపోవడం, చర్మం పసుపు రంగులోకి మారడం, చర్మంపై మార్పులు, దగ్గు, గొంతు బొంగురు పోవడం, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం పడటం, లేదా రాత్రులు చమటలు పరీక్షలు చేయించుకుని, త్వరగా చికిత్స పొందితే క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker