పెళ్ళైన జంటలకు సంతాన భాగ్యం కలగాలంటే వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలో తెలుసా..?
ఇటీవలి కాలంలో పురుషులలో వీర్యకణాల సంఖ్య బాగా తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయంగా మారింది. పురుషులలో వీర్యంలో వీర్య కణాల సంఖ్య తగ్గిపోవడం, వీర్య కణాలు పూర్తిగా లేకపోవడం, వీర్య కణాలలో కదలికలు తగ్గడం, వీర్యకణాల ఆకృతి సరిగా లేకపోవడం వంటి లోపాలు కనిపిస్తాయి. అయితే ఇటీవల కాలంలో వంధ్యత్వం పెరుగుతోంది. చాలా జంటలు సంతాన భాగ్యానికి నోచుకోవం లేదు. దీంతో వారికి నిరాశే మిగులుతోంది. తమ జీవితంలో తమకు ఆ అవకాశం లేకుండా పోవడంపై కలత చెందుతున్నారు.
ఆధునిక కాలంలో మన జీవన విధానమే మనకు సంతానం లేకుండా చేస్తోందనే విషయం చాలా మందికి తెలియదు. మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా సంతానం కలగకపోవడానికి కారణమవుతోంది. మహిళలు కూడా ఎంతో వేదనకు గురవుతున్నారు. సంతాన సమస్యను తీర్చడానికి కొన్ని ఆహారాలు మనకు ఉపయోగపడతాయి. ఇందులో వెల్లుల్లి ప్రధానమైనది. వీర్యకణాలు పెరిగేందుకు దోహదడుతుంది. జననాంగాలకు రక్తసరఫరా చేయడంలో సాయపడుతుంది. ఎలిసిన్ అనే పదార్థంతో వెల్లుల్లి మనకు ఎంతో మేలు చేస్తుంది.
వీర్య కణాల సంఖ్య పెంచేందుకు కారణమవుతుంది. సంతాన భాగ్యం కలిగడానికి వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంతానం కోసం తపించే వారు వెల్లుల్లిని తీసుకుని ఆ సమస్య నుంచి బయట పడేందుకు ప్రయత్నించాలి. గుడ్లు కూడా ప్రొటీన్లు ఉన్న ఆహారమే. ఇందులో ఉండే విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంతో వృషణాల్లో కణాల నాశనాన్ని తగ్గిస్తుంది. గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ను అరికట్టి వీర్య కణాల సంఖ్య పెరిగేలా చేస్తాయి.
అరటి పండ్లలో బ్రొమేలియన్ అనే ఎంజైమ్ ఉండటం వల్ల హార్మోన్లు విడుదల చేస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ సి విటమిన్లు వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతాయి. డార్క్ చాక్లెట్ కూడా సంతాన భాగ్యాన్ని కలిగిస్తాయి. ఇందులో ఉండే ఎల్ ఆర్గినిన్ హెచ్ సీఎల్ అనే ఉత్ర్పేరకం కూడా వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సంతాన లేమి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా వారికి ఫలితం దక్కడం లేదు. సంతాన భాగ్యం కలగాలంటే పైన చెప్పిన ఆహారాలను తీసుకుని సంతానం కోరికను తీర్చుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. దీంతో చిన్నపాటి చిట్కాలు పాటించి వంధ్యత్వాన్ని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.