మీ కళ్లపై ఈ గుర్తులు కనిపిస్తున్నాయా..? అది దేనికీ సంకేతమో తెలిస్తే..?
జీవనశైలిలో వస్తున్న మార్పులు, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ లైపోప్రొటీన్ల కలయికతో ఉంటుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణను నిరోధిస్తుంది. దీంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడానికి HDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే కొలెస్ట్రాల్ సమస్య ఎంత సాధారణమైందంటే..ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటోంది. కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంపై కొన్ని లక్షణాలు కన్పిస్తాయి. కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంపై ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయి.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చర్మంపై కన్పించే లక్షణాలు.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంపై కొన్ని సంకేతాలు కన్పిస్తాయి. ఇలా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే శరీరంపై కన్పించే సంకేతాలకు కారణం కొలెస్ట్రాల్ పెరగడమే. ఈ సంకేతాలు కాళ్లు, చేతులు సహా ఇతర ప్రాంతాల్లో కన్పించవచ్చు.
అంతేకాదు..గుండె సంబంధిత సమస్యలు దూరమౌతాయి. కళ్లపై పసుపు మచ్చలు.. మీ కళ్లపై పసుపు మచ్చలు కన్పిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే రక్తంలో కొవ్వు పెరిగి..కళ్లపై మచ్చల్లా ఏర్పడతాయి. ఇది డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు.
చేతులు-కాళ్ల చర్మంపై నొప్పి.. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే చేతులు, కాళ్ల చర్మంలో నొప్పి ఉంటుంది. చర్మం నొప్పిగా ఉందంటే అది కేవలం కొలెస్ట్రాల్ పెరగడమే కావచ్చు. అందుకే ఈ లక్షణాలు కన్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.