గుండెపోటు వచ్చిన వారికీ CPR చేసి ఎలా బతికించాలో తెలుసుకోండి. కొందరు చేసే తప్పులు వల్ల కూడా..?
దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, అతని పల్స్ పడిపోతుంటే, గుండెపోటు లేదా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సంభవించినట్లు అర్థం. అయితే కార్డియోపల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) అంటే.. గుండె పనితీరు అకస్మాత్తుగా ఆగిపోయేటప్పుడు, ఆగిపోయిన వారికి వెంటనే పంప్ చేసేందుకు ఉపయోగపడుతుంది. గుండెకు పంపింగ్ చేస్తూ, అదే సమయంలో ఊపిరితిత్తులు ఫ్రెష్ ఆక్సిజన్ తీసుకునేలా చేయాలి.
ఇందుకోసం పేషంట్ నోట్లో నోరు పెట్టి ఊదుతూ గాలి అందించాల్సి ఉంటుంది. సీపీఆర్ ఎలాంటి వారికి అవసరం.. కార్డియాక్ అరెస్ట్ అయిన వారందరికీ సీపీఆర్ తప్పకుండా అవసరమని గుండె వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఎలాంటి వారికి సీపీఆర్ అవసరమో తెలుసుకొని ఉండాలి. సాధారణంగా రెండు సందర్భాల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. ఒకటి గుండె కొట్టుకోవడం చాలా తగ్గిపోతుంది. హార్ట్ బీట్ ఉండదు. రక్తం సరఫరా ఆగిపోతుంది. ఇలాంటి వారికి ఈసీజీ స్ట్రెయిన్ లైన్ వస్తుంది. ఇలాంటి వారికి సీపీఆర్ చేసి బతికించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండోది.. గుండె వేగంగా కొట్టుకోవడం.
సాధారణంగా గుండె నిమిషానికి 50 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. ఈ సందర్భంలో గుండెపోటు 200 కంటే ఎక్కువ సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత గుండె అలసిపోయి ఒక్కసారిగా ఆగిపోతుంటుంది. అలాంటి సమయంలో మరణం తప్పదని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారికి సీపీఆర్ చేస్తే ఎంతో మేలంటున్నారు. ఎలా చేయాలి.. గుండెపోటు లేదా కార్డియక్ అరెస్టుకు గురైన వ్యక్తిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. రెండు చేతులతో ఛాతీ మధ్యలో బలంగా ప్రెస్ చేస్తుండాలి. అలా 30 సార్లు వరుసగా చేయాలి. మధ్యలో నోటితో పేషెంట్ నోటిలోకి శ్వాసను ఇవ్వాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేయాలి.
పిల్లలకు మాత్రం ఛాతీ మధ్యలో ఒక చేతితోనే ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇక శిశువుల విషయానికి కేవలం ఛాతీ మధ్యలో రెండు వేళ్లతో మాత్రమే మెల్లగా అదుముతూ ఉండాలి. సీపీఆర్ చేయడం వల్ల ప్రపంచంలో చాలా మంది బతికారు. సీపీఆర్ ఆగిపోయిన శరీరభాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చూస్తుంది. మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం నుంచి గట్టెక్కవచ్చు. సీపీఆర్ ఎవరు చేయాలి.. సీపీఆర్ అనేది ఎవరికి చేయాలి..? వైద్యుడు గానీ, వైద్య సంబంధిత వ్యక్తిగానీ సీపీఆర్ చేయాలని లేదు. సీపీఆర్ గురించి శిక్షణ తీసుకున్న వారైనా చేయవచ్చు. కానీ సీపీఆర్‌ను ఒక పద్దతిలో చేయాలి.
గుండె పై భాగంలో ఉండే స్టెర్నమ్ అనే ఎముక వద్ద ప్రెజర్ ఇచ్చి, హార్ట్‌ను స్టిమ్యులేట్ చేయాలి. ఎంత ప్రెజర్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ప్రెజర్ ఇస్తే రిబ్స్ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. అలాగని నెమ్మదిగా చేస్తే ప్రెజర్ సరిపోదు. అందువల్ల ఒక మోతాదులో చేయాల్సి ఉంటుంది. అందుకే సీపీఆర్ శిక్షణ తీసుకున్నవారైతే మంచిది. వారు ఒక పద్దతిని అనుసరించి చేస్తారు. దీంతో గుండెపోటు వచ్చిన రోగి బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేల అస్వస్థతకు గురైన పేషెంట్ ఉన్న ప్రదేశంలో బెడ్ లాంటిది లేకపోతే నేలమీద పడుకోబెట్టి చేయవచ్చు. ఇద్దరు వ్యక్తులు కూడా సీపీఆర్ చేయవచ్చు. మరో వ్యక్తి నోటి ద్వారా శ్వాస అందించాలి.
ఇలాంటి సమయంలో మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ చేసే విషయంలో మూడు అంశాలు గుర్తించుకోవాలి.. ఇక సీపీఆర్ చేసే విషయంలో మూడు అంశాలను తప్పకుండా గుర్తించుకోవాలి. శ్వాస ఆగిపోకుండా చూడాలి. హార్ట్ బీట్ రివకీర అయ్యేలా చేయాలి. అలాగే రక్తం పంపింగ్‌ను పునరుద్దరించాలి. పేషెంట్ స్పందన బట్టి ప్రతి ఐదు బీట్లకు ఒకసారి నోటి ద్వారా శ్వాసను అందించాలి. ఇవన్ని చేయాలని శిక్షణ పొందిన వారికే సాధ్యమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీపీఆర్‌తో పేషెంట్ ఎంత సమయంలో కోలుకుంటారు..ఇక సీపీఆర్ చేస్తే పేషెంట్ రెండు నిమిషాల్లోనే కోలుకునే అవకాశం ఉంది. కొంత మందికి ఎలక్ట్రిక్ షాక్ లాంటివి అవసరం ఉండవచ్చు. అలాంటి వారు కోలుకునేందుకు కనీసం అరగంటకుపైగా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.