ఈ మూడు సమస్యలున్నవారికి ప్రాణాలకే ముప్పు ఎక్కువ, ఎందుకంటే..?
ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి. బీపీ సమస్య ఉండొచ్చు. ఈ రెండు ఉన్నవారిక అధిక బరువుండకపోవచ్చు. ఇలా ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే గనుక.. అధిక రక్తపోటు, పొగతాగడం, అధిక బరువు.. ఈ మూడు సమస్యలు ఒకరికి ఉంటే మాత్రం మరణానికి గురికావచ్చని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ఈ మూడు కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా మరణానికి గురవుతున్నారని తేలింది. ఈ మూడు సమస్యలను నియంతించవచ్చు. కానీ వాటి గురించి పెద్దగా పటించుకోకపోవడంతో ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారు.
బీపీ సమస్యల పురుషులు, స్త్రీలలోనూ అధికంగానే ఉన్నట్లు గుర్తించారు. అసలు బీపీ అధికమైన మరణానికి దారితీసేందుకు కారణాలిలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అన్నటికన్నా మొదటిది మద్యం.. కొద్ది మోతాదులో మద్యం సేవించడం వల్ల హృద్రోగ సమస్యలు రాకుండా నియంత్రించే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా తీసుకుంటే అది ప్రాణానికే ముప్పు తెస్తుంది. మద్యం తీసుకోవడం వల్ల అప్పటికే ఉన్న రక్తపోటు స్థాయిని మరింత పెంచేందుకు దోహదపడుతుంది.
ఫలితంగా రక్తనాళాలు పాడైపోవడం జరుగుతుంది. దీనితో చికిత్స కూడా క్లిష్టతరంగా మారుతుంది. పరిస్తితి ఇలా ఉండడం వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. ఉప్పు : రెండోది ఉప్పు. ఇది లేకుంటే ముద్ద దిగదు కొందరికి. ఇది తిన్నా నాకేం కావట్లేదని కొందరు అంటుంటారు. దీని ప్రభావం వెంటనే ఉండదు. కొద్ది రోజులకు కానీ దీనివల్ల ఏమవుతుందో తెలుస్తుంది. ఉప్పు తీసుకోవడం వల్ల కొందరిలో వెంటనే రక్తపోటు పెరిగిపోతుంది.
ఐతే మరికొందరిలో అంతటి మార్పు కనబడదు. ఐతే బీపీ ఉన్నవారు ఉప్పు తీసుకోవడాన్ని కచ్ఛితంగా తగ్గించాలి. ఉప్పు తీసుకోవడం తగ్గించినట్లయితే దాదాపు తగ్గించుకుంటే బీపీ రోగులకు ఎంత శ్రేయస్కరం. ఎందుకంటే ఒక స్థాయి నుంచి రెండో స్థాయికి బీపీ చేరుకున్నదంటే అది మూత్రపించాడలను పాడు చేస్తుంది. కాబట్టి నియంత్రణ చాలా ముఖ్యం. తేలికగా తీసుకోరాదు. మూడవది కొవ్వు పదార్థాలు : మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలేంటో తెలుసు.
అయినా వాటిని కొనుగోలు చేసీ మరి తింటాం. అలా చేయకూడదు. కొవ్వు పదార్థాలను దూరంగా పెట్టాలి. సాచ్చురేటెడ్ ఫ్యాట్, ప్యాట్లను కచ్ఛితంగా దూరంగా పెట్టేయాలి. ఇవి రెండూ గుండెకు, రక్తనాళాలను పాడు చేయడంలో ముందుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ అధిక రక్తపోటు కారణంగా రక్తనాళాలు, గుండె ఎంతో ఒత్తిడికి గురై ఉంటాయి. ఈ స్థితిలో వాటిపై కొవ్వులు కూడా దాడి చేస్తే క అన్నీ కలిసి ప్రాణం తీసేందుకు సిద్ధమైపోతాయి. ఫాస్ట్ ఫుడ్స్, ఎర్రమాంసం, వేరుశనగ పప్పు, నూనె, నెయ్యి, తదితర కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించాలి. అప్పుడే రక్తపోటును నియంత్రించవచ్చు.