రోజు రెండు ఈ ఆకులు తింటే చాలు జీవితంలో ఏ రోగాలు మిమ్మల్ని ఏం చేయలేవు.
మునగను అన్ని వంటకాల్లో వినియోగిస్తుంటారు. మునగ ఆకులు, కాడ, కాయల్లో, పువుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్ వంటి మూలకాలతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు మునగ ఆకులలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మునగ ఆకులను కూరగా వండుకుని తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
అంతే కాకుండా ఆకులను ఎండబెట్టి పొడి చేసి తినవచ్చు. ఆయుర్వేదంలో , ఈ ఆకులను అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. అయితే మునగకాయలతో ఏ కూర చేసినా చాలా మంది ఇష్టంగానే తింటారు. అయితే నిజానికి మునగకాయల కన్నా మునగ ఆకులను తింటే ఇంకా మనకు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మునగ ఆకుతో కూర చేసుకుని తినవచ్చు. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
ఎలా తీసుకున్నా సరే.. మునగ ఆకు మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. మునగ ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఆ ఆకులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. అందులో ఉండే ఐరన్ రక్తహీనతను పోగొడుతుంది.
మునగ ఆకుల్లో ఉండే కాల్షియం మన శరీరంలో ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది. మునగ ఆకును రోజూ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. బాగా తలనొప్పిగా ఉంటే మునగ ఆకు రసాన్ని తాగితే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారు మునగ ఆకు రసాన్ని రోజూ తాగితే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.