కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..?
కట్టెల పొయ్యి మీద చేసే వంట, రోట్లో నూరిన పచ్చడి, రోటిలో రుబ్బిన పిండితో వేసే గారెలు..అబ్బో ఆ రుచే వేరు. కానీ ఇప్పుడు అస్సలు ఎవ్వరికి అంత టైం ఉండటం లేదు..కుదిరితే ఎలక్ట్రిక్ స్టవ్..లేందంటే ఆన్‌లైన్ ఆర్డర్. బట్.. మనం వెనకటితరం ఫార్మాలిటీస్ మళ్లీ ఆరంభించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే చాలామంది మిల్లిట్స్ తినడం, యోగా చెయ్యడం, ఆయుర్వేదిక వైద్యం ఫాలో అవ్వడం వంటివి చేస్తూ బ్యాక్ టూ ఓల్డెన్ ( గోల్డెన్ ) డేస్ అంటున్నారు.
మీరు అంతదూరం వెళ్లకపోయినా పర్వాలేదు..కానీ కొన్ని చిన్న చిన్నవైనా పాటిస్తే జీవన ప్రమాణాలను కాస్త పెంచుకోవచ్చు. అయితే మారుతున్న కాలంతో పాటే చాలామంది సమయం ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్ లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.
వీటిని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే వంట అయిపోవడంతో పాటు సులభంగా వంట చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే రైస్ కుక్కర్ లో వండిన ఆహారం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు. అన్నం వండుకునే సమయంలో గాలి, వెలుతురు తగులుతూ ఉండాలని అలాంటి ఆహారం తింటే సమస్యలు రావని సూచిస్తున్నారు.
రైస్ కుక్కర్ లలో వండిన ఆహారం తింటే ఉదర సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్, కీళ్ల వాతం, నడుము నొప్పి, అధిక బరువు ఇతర సమస్యలు వస్తాయని తెలుపుతున్నారు. గృహిణులు, యువత రైస్ కుక్కర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని.. రైస్ కుక్కర్ లో అన్న వండుకోవడంతో పాటు గుడ్లు ఉడికించుకోవడం, కూరలు వండుకోవడం చేస్తున్నారని.. అయితే వీలైనంత వరకు రైస్ కుక్కర్లను వినియోగించుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రైస్ కుక్కర్ లో వండిన ఆహారాన్ని నిల్వ చేయడం కూడా మంచిది కాదని సూచిస్తున్నారు. ఎంతో అవసరమైతే తప్ప రైస్ కుక్కర్లలో అన్నం వండుకోకూడదని.. అలా చేస్తే తాత్కాలికంగా ఎటువంటి సమస్యలు లేకపోయినా భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.