ఈ ఆకూ కూర తరచూ తింటుంటే జీవితంలో షుగర్ వ్యాధి రాదు.
తోటకూర ఆకుల్లో రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే గుణాలున్నాయి. ఇందులోని టోకోట్రినాల్స్, విటమిన్ E కొలెస్ట్రాల్ స్థాయిలనుతగ్గిస్తుంది. ఫైబర్ కంటెంట్ కారణంగా తోటకూర తింటే త్వరగా జీర్ణం అవుతుంది. రక్తంలో LDL స్థాయిలను తగ్గిస్తుంది. అయితే ఆకుకూరలు తింటే చాలా మంచిదని అటు డాక్టర్లు, ఇటు నిపుణులు వివిధ పరిశోధనల్లో తేలుస్తూనే ఉన్నారు. కానీ తినడానికి మనకే మనసొప్పదు.
కానీ ఏ పండ్లు, కూరగాయలు తిన్నా కూడా లభించని విటిమిన్లు ఆకుకూరల్లో ఉంటాయి. అందుకే గర్భిణులను ఆకుకూరలు ఎక్కువగా తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఆకుకూరల్లో తోటకూరలో అత్యధిక విటమిన్లు ఉంటాయని ఇటీవల లండన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేటతెల్లమైంది.
తోటకూరలో క్యాల్షియం, ఎ,బి1, బి2, బి6, సి, కె, విటమిన్లు, ఐరన్, రిబోఫ్లేవిన్, పొటాషియం, జింక్, ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. పాలను జీర్ణించుకోలేని వారు తోటకూర తినడం చక్కటి ప్రత్యామ్నాయం. పాల ద్వారా అందాల్సిన క్యాల్షియమ్‌ను తోటకూర భర్తీ చేస్తుంది. మధుమేహం ఉన్నవారు రోజూ తోటకూర తినడం మంచిది.
ఇది ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగినంత ఉండడానికి దోహదం చేస్తుంది. తోటకూర శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వారానికోసారి తోటకూర తింటే నోట్లో పుండ్లు, చిగుళ్లవాపు, గొంతునొప్పి వంటి సమస్యలన్నీ నివారణ అవుతాయి.
ఈ ఆకులోని పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది, రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తోటకూర తింటే చక్కటి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది.