షుగర్ పేషెంట్స్ ఆపిల్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
మధుమేహం… ఇది ఒకసారి సోకిందంటే జీవితాంతం భరించాల్సి ఉంటుంది. బాధితుల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే తీవ్రమైన అనారోగ్యాలు ఎదురవ్వొచ్చు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేదానిపై అనేక అపోహలు ఉన్నాయి.
అయితే షుగర్ తింటే తియ్యగా ఉంటుంది. వైద్యులు రోజుకు ఒక ఆపిల్ తింటే అన్ని రోగాలు నయమవుతాయని చెబుతూ ఉంటారు. మరి షుగర్ రోగులు ఆపిల్ తినవచ్చా..? అంటే వైద్యులు తినవచ్చని చెబుతున్నారు. ఆపిల్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆపిల్స్ రుచితో పాటు పోషక విలువలు కలిగి ఉంటాయని చెబుతున్నారు.
ఆపిల్స్ లో ఉండే ఫైబర్ షుగర్ లెవెల్ ను అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఆపిల్ ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఆపిల్ జ్యూస్ తాగితే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. షుగర్ బారిన పడని వారు రోజూ ఆపిల్ తింటే షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆపిల్ బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.
ఆపిల్స్ లో ఉండే మాలిక్ ఆసిడ్ జీర్ణక్రియ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. డయేరియాతో బాధ పడే వారికి ఆపిల్ ఆ సమస్యను దూరం చేస్తుంది. ఆపిల్ ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. శరీరంలోని అనవసర కొవ్వును తగ్గించడంలో ఆపిల్ సహాయపడుతుంది. విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే యాపిల్స్ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.