ఈ చిన్న చిన్న రోగాలను నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.
గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఏటా 17.9 మిలియన్ల చావులు గుండె జబ్బుల కారణంగానే వస్తున్నాయి. గుండె జబ్బు అనే పదం వినగానే భయపడిపోతాం. అయితే ఈ గుండె జబ్బు చుట్టూ అనేక అపోహలు అలుముకుని ఉన్నాయి. అయితే మారుతున్న జీవనశైలి చెడు అలవాట్ల కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. అయితే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే.
కానీ చాలామంది ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తీవ్రంగా పేరుకుపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంపై పలు లక్షణాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. శరీరంలో కొవ్వు పెరగడం వల్ల ఈ కింది లక్షణాలు తరచుగా ఏర్పడతాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ మంచిదా చెడు దాని వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.
లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లే.. చల్లటి పాదాలు..చాలామందిలో చలికాలంలో పాదాలు చల్లగా మారుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైనప్పటికీ వేసవికాలంలో కూడా ఇలా మారితే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగినట్లు లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
పాదాల్లో నొప్పి..శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అతిగా పెరగడం వల్ల రక్తనాళాల్లో తీవ్ర సమస్యలు ఏర్పడి.. రక్త ప్రసరణ వేగం తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీంతో కాళ్ల నొప్పి వాదాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తరచుగా ఇలాంటి నొప్పులతో బాధపడేవారు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గోరు రంగు.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల పాదాల గోళ్ల రంగు మారే అవకాశాలున్నాయి. లైట్ పింక్ కలర్ లో ఉండే గోళ్ల రంగు పసుపు రంగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
కాబట్టి మీలో ఇలాంటి సమస్యలుంటే తప్పకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆకస్మిక కుదుపు.. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా కాళ్ళలో తిమ్మిరి లేదా మెలితిప్పినట్లు ఉంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి కండరాల సమస్యలు ఏర్పడడం వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.