ప్రేగు వ్యాధులు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసా..?
మనం తీసుకునే ఏ ఆహారమైన ముందు ప్రేగు భాగంలోకి చేరాల్సిందే. ఈ ప్రేగులలో ఎటువంటి ఇబ్బందికలిగినా.. మన దైనందిక జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మన కడుపులోని ప్రేగులు రెండు భాగాలుగా ఉంటాయి. అందులోని చిన్న ప్రేగుకి రక్షణగా దాని చుట్టూ అమరి ఉండే పెద్ద ప్రేగు సంబంధించినది ఈ ఇన్ఫెక్షన్. అయితే ప్రేగులు కూడా శరీరంలో ముఖ్యమైన అవయవాలే.
ఎందుకంటే జీర్ణవ్యవస్థను అనుసంధానం చేసి వ్యర్ధాలను బయటకు పంపించేందుకు ప్రేగులు పాత్ర విశేషమైనది. ఒకవేళ ఇవి స్తంభించి తీవ్ర సమస్యలకు గురైతే రకాల పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటి ప్రభావం జీర్ణ వ్యవస్థ పై పడి అది దెబ్బ తినే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పకుండా దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ప్రేగులను జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ప్రేగు ఆరోగ్యం కోసం ఏమి చేయాలి.. ప్రతిరోజు తీసుకునే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. అంతేకాకుండా పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో గింజలు, పండ్లు, మొలకలు నేర్చుకోవాల్సి ఉంటుంది.
వీలైతే ఆహారాల్లో నూనె మసాలాలను అతిగా వినియోగించకపోవడం చాలా మంచిది. ప్రొటీన్‌ని ఆహారంలో చేర్చుకోండి.. అధికంగా ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే పేగులకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పొట్ట సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆహారంలో గుడ్లు, చీజ్, తృణధాన్యాలు, పప్పులు, సోయాబీన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఆధునిక జీవన శైలి.. చాలామంది ఆధునిక మన శైలిని అనుసరిస్తున్నారు. లో భాగంగానే బయట లభించే అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావడమే కాకుండా జీర్ణ క్రియ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా చాలామంది బిజీ లైఫ్ కారణంగా వ్యాయామాలు కూడా చేయలేకపోతున్నారు.