నీలగిరి తైలం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే వాడుతారు.
జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కీళ్ల నొప్పుల వంటి సమస్యలకు ఈ నూనె మంచి ఔషధంగా పనిచేస్తుంది. నీలగిరి తైలం ఔషధంగా ఉపయోగపడుతుంది. నీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు ఆ పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే జండుబామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది. అయితే చర్మ సంరక్షణలో యూకలిప్టస్ ఆయిల్(నీలగిరి తైలం) ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు, డెర్మటాలజిస్ట్‌లు స్వయంగా ధృవీకరిస్తున్నారు.
చర్మంపై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ చూపించని యూకలిప్టస్ ఆయిల్ మన స్కిన్‌ని వడదెబ్బ, పగుళ్లు నుంచి రక్షించడమే కాక ఎన్నో విధాలుగా సంరక్షిస్తుంది. యూకలిప్టస్ నూనెను యూకలిప్టస్ చెట్టు ఆకుల నుంచి చేస్తారు. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పలు లక్షణాలు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. వడదెబ్బ నుంచి రక్షణ.. యూకలిప్టస్ ఆకులకు శరీరం, చర్మం వడదెబ్బ బారిన పడకుండా రక్షిస్తుంది.
అంతేకాక వడదెబ్బ తగిలిన వారు తొందరగా కొలుకునేలా చేసే లక్షణాలు కూడా ఈ నూనెలోపుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది.. యూకలిప్టస్ ఆయిల్ చర్మాన్ని తేమగా ఉంచే గుణాన్ని కూడా కలిగి ఉంది. చర్మం పొడిబారినప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిల చర్మంపై యూకలిప్టస్ నూనెతో మసాజ్ చేసుకోవచ్చు.
ఎండాకాలం, చలికాలం అని తేడా లేకుండా చర్మ సంరక్షణ కోసం యూకలిప్టస్ నూనెను ఉపయోగించవచ్చు. గాయాలు త్వరగా నయమవుతాయి.. యూకలిప్టస్ ఆయిల్ ద్వారా మనం పొందగలిగే మరో ప్రయోజనం ఏమిటంటే ఇది చర్మంపై ఉన్న చిన్న చిన్న గాయాలను త్వరగా నయం చేస్తుంది.ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే ఇందుకు కారణం.
గాయాలు అయినప్పుడు యూకలిప్టస్ నూనెను రోజుకు రెండుసార్లు వాటిపై రాయండి. తక్షణ ఫలితాలను మీరే గమనించవచ్చు. నూనెను ఎలా రాయాలంటే.. ఇతర నూనెలను వాడిన మాదిరిగా కాకుండా యూకలిప్టస్ నూనెను వాడే విధానం భిన్నంగా ఉంటుంది. దీన్ని మీరు చర్మంపై నేరుగా అప్లై చేయకుండా, రోజూ వాడే నూనెలో కలపండి. సాధారణ నూనెలో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ను మాత్రమే కలపాలి.