ఈ పండ్లు తింటే శరీరంలో కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
ఇటీవల కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్ తో పాటు చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. పొట్ట, పిరుదులు, నడుము భాగాల్లో కొవ్వు పేరుకుపోయి చాలా ఆరోగ్య సమస్యలకు దారితీసస్తుంది. శరీరాకృతి మారేంత వరకు లేదా బరువు పెరిగే వరకు ఈ సమస్య ఉన్నట్లు మనకు తెలియదు. ముఖ్యంగా తినే ఆహారం, మన జీవనశైలి కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.
గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు ఈ అధిక కొలెస్ట్రాల్ దారితీయవచ్చు. అయితే ఈ చలికాలంలో పుష్కలంగా లభించే పండ్లలో ఆలు బుకరా పండ్లు ఒకటి. ఈ సీజన్ లో ఈ పండ్లు ను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధులు సోకే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఆలు బుకరా పండ్లతో కేకులు, ఊరగాయలు, జామ్ లు, ఇతర స్వీట్లను తయారుచేస్తారు.
ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను, రక్తప్రసరణను పెంచడానికి సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఆలు బుకరా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అలాగే గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాల్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.. ఈ పండ్లలో కరిగే ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే కాలెయం కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. పిత్తం కొలెస్ట్రాల్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. అలాగే కరిగే ఫైబర్ ద్వారా శోషించుకోబడుతుంది. ఎముకలకు మంచిది.. ఆలు బుకరాలో బోరాన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముక సాంద్రతను రక్షిస్తుంది. ఈ పండులో ఉండే ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ రసాయనాలు ఎముక నష్టాన్ని ఆపుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. ఆలు బుకరా పండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
ఇది జలుబు, ఫ్లూ రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ గుజ్జు పండు బలమైన కణజాలాల పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని ఆపుతాయి.. ఆలు బుకరా పండ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. ఈ పండ్లను తింటే జుట్టు రాలడం ఆగుతుంది. దీనిలో ఉండే ఐరన్ కంటెంట్ రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో మీ జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది. మలబద్దకం నుంచి ఉపశనం కలుగుతుంది..ఆలు బుకరాలో సోర్బిటాల్, ఇసాటిన్ లు ఉంటాయి. ఇవి మలబద్దకాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఎండిన ఆలు బుకరాను తింటే మీ గట్ ఆరోగ్యం బాగుంటుంది.